Minister RamPrasad Reddy: ఆ హామీని నిలబెట్టుకుంటాం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Dec 22 , 2024 | 12:22 PM
ఏపీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈసందర్భంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని మాటిచ్చారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
విశాఖపట్నం: జగన్ ప్రభుత్వ హయంలో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యం అయిందని... ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రక్షాళన చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లిరాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ద్వారకా నగర్ బస్ స్టేషన్‌లో ఆదివారం నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ఒక్క కొత్త బస్సులు కూడా కొనలేదని..కొత్త బస్సులు ప్రవేశపెట్టడానికి సీఎం చంద్రబాబు నాయుడు అని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. త్వరలోనే డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిని పోస్టులు కూడా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం తప్ప వైసీపీ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం చేపట్టలేదని మండిపడ్డారు.
ఎక్కువ మంది కార్మికులకు ఏపీఎస్ఆర్టీసీయే ఉపాధి కల్పిస్తుందని వివరించారు. జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగస్తులను ఒక పురుగుల్లా చూసిందని.. వారి జీవితాలతో ఆడుకుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని మాటిచ్చారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రెండు రోజుల కిందటే ఒక కమిటీని వేశామని గుర్తుచేశారు. ఉచిత బస్సు ప్రయాణ హామీని నిలబెట్టుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Perni Nani: పేర్ని నాని కేసులో ఊహించని మలుపు
CPI: దొంగ వ్యాపారాన్ని గౌరవంగా చూపిస్తున్నారు: కె.నారాయణ
Mystery Unfolds : మరిదే సూత్రధారి!
Read Latest AP News and Telugu News
Updated Date - Dec 22 , 2024 | 12:30 PM