Nimmala: జగన్ ఇంటి ముందే ధర్నాలు చేయాలి
ABN , Publish Date - Dec 27 , 2024 | 02:47 PM
Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేస్తున్న ధర్నాపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ మాజీ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంపుతో పాటు ట్రూ ఆఫ్ చార్జీలు అంటూ 16 వేల కోట్లు ప్రజలపై భారం మోపింది జగన్ అని అన్నారు.
పశ్చిమగోదావరి, డిసెంబర్ 27: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఐదేళ్ల అరాచక పాలనతో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. పాలకొల్లు నియోజకవర్గంలో మూడు గ్రామాల్లో రూ .3 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం నాడు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంపుతో పాటు ట్రూ ఆఫ్ చార్జీలు అంటూ 16 వేల కోట్లు ప్రజలపై భారం మోపింది జగన్ అని అన్నారు. జన్ కో నుంచి ఐదు రూపాయలకే యూనిట్ కరెంటు లభించే అవకాశం ఉండగా కమిషన్ల కోసం రూ. ఎనిమిది నుంచి 14 రూపాయలకు జగన్ కొనుగోలు చేశారని విమర్శించారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిన జగన్ ఇంటి ముందే వైసీపీ శ్రేణులు ధర్నాలు చేయాలన్నారు. ఏపీలో విద్యుత్ లోటును 2014- 19 ఐదేళ్లలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుది అని అన్నారు. గత చంద్రబాబు పాలనలో విద్యుత్ చార్జీలను పెంచకపోవడమే కాకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఆ పాపం జగన్‌ది కాదా: మంత్రి సవిత
అమరావతి: గత ఐదేళ్లలో జగన్ ది పొలిటికల్ డైవర్షన్ మంత్రి సవిత వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ హత్యను ఎలా డైవర్ట్ చేశారో చూశామన్నారు. 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని.. 17 వేల కోట్లు విద్యుత్ చార్జీల భారం జగన్ చేసిన పాపం కాదా అని ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలపై వైసీపీ ధర్నాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ధర్నాలు చేసి జగన్ మరోసారి తుగ్లక్‌గా మారారన్నారు. అసెంబ్లీ రాకుండా రోడ్డు మీద ధర్నాలు ఏమిటి అని నిలదీవారు.
ఎట్టకేలకు చిక్కిన డెడ్ బాడీ పార్శిల్ కేసు నిందితుడు..
గత ఐదేళ్లలో విమానంలో తిరిగిన జగన్... ఇప్పుడు రోడ్డు మీదకు వస్తా అని అంటున్నారని ఎద్దేవా చేశారు. ‘‘విద్యుత్ చార్జీల పెంపుపై పబ్లిక్‌లో చర్చకు మేం సిద్ధం...మీరు సిద్ధమా.. మా ప్రభుత్వం చెప్పిన హామీలు అన్ని అమలు చేస్తున్నాం. పెన్షన్ను పెంచాం.. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నాం. మా పథకాలు అమలు వైసీపీ వాళ్లకు మాత్రమే కనపడటం లేదు’’ అంటూ మంత్రి సవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి...
Fake Currency: ఏపీలో రెండు జిల్లాల్లో దొంగ నోట్ల కలకలం
గుర్తుపెట్టుకోండి.. జనవరి 1 నుంచి మారేవి ఇవే..
Read Latest AP News And Telugu news