Share News

స్ఫూర్తిదాయకంగా నాటిక ప్రదర్శనలు

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:51 PM

పాలకొల్లు కళాపరిషత్‌ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన జాతీయస్థాయి నాటక పోటీలలో రెండో రోజు ఆదివారం స్ఫూర్తిదాయకమైన మూడు నాటికలు ప్రదర్శించారు.

స్ఫూర్తిదాయకంగా నాటిక ప్రదర్శనలు
పాలకొల్లులో ‘అసత్యం’ నాటికలో సన్నివేశం

పాలకొల్లుఅర్బన్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : పాలకొల్లు కళాపరిషత్‌ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన జాతీయస్థాయి నాటక పోటీలలో రెండో రోజు ఆదివారం స్ఫూర్తిదాయకమైన మూడు నాటికలు ప్రదర్శించారు. మొదటి ప్రదర్శనగా హైదరాబాద్‌ వారి ‘ఇది రహదారి కాదు’ నాటికలలో సముద్రాలుగా బి.నాగరాణి, సూరీడుగా బి.దేవేష్‌, కిషోర్‌గా సీహెచ్‌ జగదీష్‌, నాగుగా మంజూనాధ్‌, పార్దుగా టి.సుజిత్‌, రైలు బాబాయ్‌గా ఎస్‌ఎం బాషా, దివ్యగా పూజిత సింధూరి నటించగా, సంగీతాన్ని సురభీ నాగరాజు, లైటింగ్‌ను నోరి రామ్మోహన్‌, సెట్‌ను అర్షద్‌, నోరి రామ్మోహన్‌, ఆహార్యంను పి.గిరిధర్‌, కాగా రచన ఆకురాతి భాస్కరరావు, ఎస్‌ఎం భాషా దర్శకత్వం వహించారు. కథాసారాంశం ఇలా.. వివాహ వ్యవస్థపై దారి తప్పుతున్న యువతను చక్కదిద్దే విధంగా కథను మలిచిన తీరు ఆకట్టుకుంది.

రెండో ప్రదర్శనగా కళాస్రవంతి (విశాఖ) ప్రదర్శించిన ‘అసత్యం’ నాటికకు కథను శ్రీసుధ మోదుగు అందించగా, నటాకీకరణను పిన్నమ నేని మృత్యుంజయరావు, దర్శకత్వాన్ని పి.బాలా జీ నాయక్‌, నటవర్గం : వివయ్యగా పి.బాలాజీ నాయక్‌, బసవయ్యగా ఎ.రామారావు, రఘుప తిగా వై.అనిల్‌ కుమార్‌, కనకయ్యగా ఎం.వాసు, వెంకట్రావుగా థామస్‌, పార్వతిగా ఎస్‌.మాధవి అభినయించగా, సంగీతాన్ని పి.తులా మోహన్‌, ఆహార్యం థామస్‌, రంగాలంకరణను ఎం.సత్తిబా బు, థామస్‌ సమకూర్చారు. కథాసారాంశం ఇలా.. దైవత్వమైనా, రాక్షత్వమైన, స్వార్ధమైనా, పరమార్థమైనా అది మనిషి హృదయంలో ఉం టుంది. ప్రతి సత్యం వెనుక అసత్యం.. ఏది సత్య మో, ఏది అసత్యమో కంటికి కనిపించేదంతా సత్యం కాదు. కనిపించనిదంతా అ’సత్యం కాదు, కథాంశంతో రూపొందించిన కథను పాత్రధా రులు నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించారు.

Updated Date - Mar 16 , 2025 | 11:52 PM

News Hub