Zodiac signs: మీరు ఈ రాశిలో పుట్టారా.. లక్ష్మిదేవి వద్దన్నా.. వస్తూనే ఉంటుంది
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:52 AM
మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సానికి స్వాగతం పలకబోతున్నాం. కొత్త సంవత్సరం వచ్చిందంటే మన జీవితంలో మార్పులు వస్తాయని ఆశించేవాళ్లు ఎంతోమంది ఉంటారు. ఈ ఏడాది ఏ రాశులవారికి బాగా కలిసొస్తుందో తెలుసుకుందాం.

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. మరో మూడు రోజుల్లో 2025కు స్వాగతం పలకబోతున్నాం. సాధారణంగా తెలుగు తిథుల ప్రకారం కొత్త ఏడాది ఉగాదితో ప్రారంభమవుతుంది. దీంతో వ్యక్తుల యొక్క జాతకాలు, రాశి ఫలాలు చూసేటప్పుడు ఉగాది నుంచి ఉగాదికి చూస్తారు. కానీ ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏడాదిగా పరిగణిస్తారు. దీంతో కొత్త సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటుంటారు. కొన్ని రాశుల వారికి ఒక ఏడాది బాగుంటే మరో ఏడాది ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఓ వ్యక్తి పుట్టిన రాశి, తిథి ఆధారంగా అతడి జాతకాన్ని తయారుచేస్తారు. కానీ జాతకంలో ఉన్నట్లే జరుగుతుందనే గ్యారంటీ మాత్రం ఉండదు. ఏది ఏమైనా జాతకాలను నమ్మేవాళ్ల సంఖ్య ఎక్కువుగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంలో ఏ రాశి వారికి బాగా కలిసొస్తుందో తెలుసుకుందాం.
ఆ నాలుగు రాశులు అదుర్స్..
ఓ వ్యక్తి ఏ రాశి ఆధారంగా జాతకం చూసేటప్పుడు ముందుగా చూసేది ఆదాయం, వ్యయం ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడతారనేది చూస్తారు. చాలామందికి వచ్చే ఆదాయంతో పోలిస్తే వ్యయం ఎక్కువుగా ఉంటుంది. మరికొన్ని రాశులవారికి ఆదాయంతో పోలిస్తే ఖర్చు తక్కువుగా ఉంటుంది. ఆదాయం ఎక్కువుగా ఉండి, ఖర్చు తక్కువుగా ఉండేవారికి వద్దన్నా డబ్బులు వస్తుంటాయని అంటుంటారు. అలా 2025లో తుల, కన్య, వృషభ, మిధున రాశి వారికి బాగా కలిసొచ్చే అవకాశం ఉందని రాశి ఫలాల ద్వారా తెలుస్తోంది. ఈ నాలుగు రాశుల్లో పుట్టినవారికి వద్దన్నా లక్ష్మిదేవి పరిగెత్తుకుంటూ వస్తోందట. సాధారణంగా డబ్బులు ఎంత సంపాదించినా మంచినీళ్లలా ఖర్చు అయిపోతుందని అంతా అంటుంటారు. ఈ నాలుగు రాశుల వారికి మాత్రం రావడం తప్పితే పోవడం తక్కువని రాశి ఫలాలు చెబుతున్నాయి.
మిధున రాశి టాప్..
ఈ ఏడాది ఆదాయం, వ్యయం చూస్తే మిధున రాశి వారికి ఆదాయం 14 కాగా వ్యయం 2గా ఉంది. 14 రూపాయిలు వస్తే రెండు రూపాయిలు మాత్రమే ఖర్చవుతుంది. దాదాపు 12 రూపాయిలు సేవ్ చేసే అవకాశం ఉంది. కన్య రాశిలో పుట్టినవాళ్లకు ఆదాయం 14 కాగా వ్యయం 2 రూపాయిలుగా ఉంది. తుల రాశి వారికి ఆదాయం 11 కాగా వ్యయం 5 రూపాయిలు. వృషభ రాశిలో వారికి ఆదాయం 11, వ్యయం రూ.2గా ఉంది. ఈ నాలుగు రాశుల్లో పట్టినవారికి ఆదాయం ఎక్కువుగా , ఖర్చు తక్కువుగా ఉండటంతో వీరి వద్దకు లక్ష్మిదేవి వద్దన్నా వస్తుందని విశ్వాసం.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here