Tamalapaku: ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో ఉంటే చాలు.. కష్టాలు తీరినట్టే
ABN , Publish Date - Mar 03 , 2025 | 05:50 PM
వాస్తు శాస్త్రం ప్రకారం, తమలపాకు మొక్క ఇంట్లో ఉంటే మన కష్టాలు తీరతాయని నిపుణులు చెబుతున్నారు. మనకు అదృష్టం కలిగి పట్టిందల్లా బంగారమే అవుతుందని చెబుతున్నారు.

కొన్ని మొక్కలు ఇంటికి అదృష్టం, శ్రేయస్సు, సామరస్యాన్ని తెస్తాయని చాలా మంది నమ్ముతారు. ఆ నమ్మకంతోనే ఇంట్లో మొక్కలను నాటుతారు. అలా మొక్కలు ఉన్న ఇంటి స్థలం సౌందర్య ఆకర్షణను పెంచడం నుండి గాలి నాణ్యతను మెరుగుపరచడంతో పాటు ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా అందిస్తుంది. ఆర్థిక వృద్ధిని, మెరుగైన ఆరోగ్యాన్ని లేదా ఆనందాన్ని కోరుకుంటున్నా, ఈ మొక్కను మీ నివాస స్థలంలో నాటడం వల్ల మీకు అనుకూలంగా అదృష్టం రావచ్చని నిపుణులు చెబుతున్నారు. సహజమైన మంచి వైబ్‌ల కోసం అత్యంత ప్రజాదరణ పొందిన అదృష్ట మొక్క ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తమలపాకుల మొక్క
వాస్తు శాస్త్రం ప్రకారం, తమలపాకుల మొక్క ఇంట్లో పెంచితే లక్ష్మీ ప్రదం అని అంటారు. తమలపాకును ఎక్కువగా తాంబూలంగా వాడుతుంటాం. చాలా మంది దీనిని నాగవల్లి అని కూడా అంటారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం తమలపాకుకు ఎంతో విశిష్టత ఉంది. ఆయుర్వేదంలో తమలపాకును ఔషధంగా ఉపయోగిస్తారు. ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడుకి తావు ఉండదని పండితుల మాట.
పట్టిందల్లా బంగారమే..
తమలపాకు మన ఇంట్లో ఉంటే మన కష్టాలు తీరతాయని అంటారు. మనకు అదృష్టం కలిగి పట్టిందల్లా బంగారమే అవుతుందని చెబుతుంటారు. డబ్బుకు కూడా లోటు ఉండదని అంటారు. ఇది ఇంటి ఆవరణలో పెరుగుతుంటే ఎటువంటి గ్రహదోషాలు ఉండవని చెబుతారు. భూత ప్రేత పిశాచులు ఇంటి దరిదాపుల్లోకి కూడా రావని అంటారు.
లక్ష్మీ దేవి అనుగ్రహం
తమలపాకు తీగ మొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్తూ ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క ఏపుగా పెరిగితే లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా మన మీద ఉన్నట్టేనని చెబుతన్నారు. అలాగే, అప్పులు తీరి ఆర్థికంగా బాగుండాలన్నా తమలపాకు మొక్కను మన ఇంట్లో పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ధనానికి లోటు ఉండకూడదంటే, ప్రతిరోజూ ఒక తమలపాకును తీసుకుని నువ్వుల నూనె కలిపిన సింధూరంతో శ్రీరామ అని రాసి, ఆంజనేయ స్వామి ఫోటో ముందు ఉంచి నమస్కరించాలని చెబుతున్నారు. మరుసటి రోజు ఆకును పారే నీటిలో వేయాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల మనం లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చని వేద పండితులు చెబుతున్నారు.
(NOTE: జ్యోతిష్య నిపుణుల ఆధారంగా ఈ సమాచారం మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
మంగళవారం నాడు ఈ 3 పనులు చేస్తే.. హనుమంతుడి ఆశీస్సులు జీవితాంతం మీతోనే ఉంటాయి..
కాల్చిన జామకాయ ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..