మత్తు పదార్థాలు విక్రయిస్తే చర్యలు
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:42 PM
మత్తు పదార్థాలను విక్రయిస్తే చర్యలు తీసుకుం టామని ఈగల్ ఎస్సై శ్రీహరి, సీఐ శ్రీరామ్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ హెచ్చరించారు. పట్టణంలో శుక్రవారం ఆపరేషన్ గరుడలో భాగంగా మెడికల్ ఏజెన్సీలు, షాపులలో ఈగల్ టీమ్, విజిలెన్స్, పోలీసులు సంయు క్తంగా తనిఖీలు నిర్వహించారు.

ఆదోనిలో ఆపరేషన్ గరుడ ఫ మెడికల్ ఏజెన్సీలు, దుకాణల్లో తనిఖీలు
ఆదోని, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలను విక్రయిస్తే చర్యలు తీసుకుం టామని ఈగల్ ఎస్సై శ్రీహరి, సీఐ శ్రీరామ్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ హెచ్చరించారు. పట్టణంలో శుక్రవారం ఆపరేషన్ గరుడలో భాగంగా మెడికల్ ఏజెన్సీలు, షాపులలో ఈగల్ టీమ్, విజిలెన్స్, పోలీసులు సంయు క్తంగా తనిఖీలు నిర్వహించారు. 20 మెడికల్ షాపులలో డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ లేకుండానే మం దులు విక్రయించినట్లు గుర్తిం చారు. నిషేధిత మత్తు పదార్థా లు ఉన్నాయా? అని పరీశిం చారు. 8 మెడికల్ షాపులలో అనుమతి లేని మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించామని, జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మందులు విక్రయించరాదని దుకాణాదారులను హెచ్చరించారు.