ఎన్‌సీఎల్‌ఏటీలో ఈఐహెచ్‌కి చుక్కెదురు
ABN , Publish Date - Dec 16 , 2024 | 05:13 AM
హైదరాబాద్‌కు చెందిన గోల్డెన్ జూబ్లీ హోటల్స్ విక్రయానికి అనుమతిస్తూ ఎన్‌సీఎల్‌టీ జారీ చేసిన ఉత ్తర్వును సవాలు చేస్తూ ఈఐహెచ్ లిమిటెడ్ దాఖలు చేసిన అప్పీలును ఎన్‌సీఎల్‌ఏటీ కొట్టివేసింది...
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన గోల్డెన్ జూబ్లీ హోటల్స్ విక్రయానికి అనుమతిస్తూ ఎన్‌సీఎల్‌టీ జారీ చేసిన ఉత ్తర్వును సవాలు చేస్తూ ఈఐహెచ్ లిమిటెడ్ దాఖలు చేసిన అప్పీలును ఎన్‌సీఎల్‌ఏటీ కొట్టివేసింది. గోల్డెన్ జూబ్లీ హోట ల్స్ సంస్థ హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌ను నిర్వహి స్తోంది. ఈ అప్పీలుపై తీర్పు చెప్పిన ఎన్‌సీఎల్‌ఏటీ ఈ హోటల్ కోసం సింగపూర్ సంస్థ ఒకటి దాఖలు చేసిన బిడ్‌ను అనుమతిస్తూ ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన తీర్పును ఎన్‌సీ ఎల్‌ఏటీ ధ్రువీకరించింది. సీఓసీ (కమిటీ ఆఫ్ క్రెడిటార్స్) మెజారిటీ నిర్ణయాన్ని ప్రశ్నించేందుకు లేదా దాన్ని మరోసారి పరిశీలించాలని కోరేందుకు ఎవరికీ హక్కు లేదని తేల్చి చెప్పింది.