Railways: ప్లాట్‌ఫామ్ టికెట్ ఎందుకు పెట్టారంటే
ABN , Publish Date - Apr 04 , 2025 | 09:48 AM
Railways: రైళ్లలో ప్రయాణం చేయని వ్యక్తులు ఫ్లాట్‌ఫామ్ టికెట్‌ను తప్పని సరిగా తీసుకోవాలి. ఫ్లాట్‌ఫామ్ టికెట్ వెనుక అసలు ఉద్దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియాలో రైళ్లలో వెళ్లే సంఖ్య ఎక్కువే. సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు రైళ్లను ఎంచుకుంటారు. ప్రతీ రోజు కోట్లాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. సాధారణంగా ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా.. మరికొందరు వారిని సాగనంపేందుకు స్టేషన్లకు వెళ్తుంటారు. అయితే రైల్లో ప్రయాణం చేయని వ్యక్తులు తప్పనిసరిగా ఫ్లాట్ ఫామ్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది దశాబ్దాల నుంచి ఉంటున్న నిబంధన. ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ ఫాం టికెట్ ధర రూ.10. ఈ టికెట్‌ను తీసుకుంటే దాదాపు రెండు గంటల పాటు రైల్వే స్టేషన్‌లలో ఉండొచ్చు. ఇంతకీ ఫ్టాట్ ఫాం టికెట్ కచ్చితం ఎందుకు.. ఒకవేళ ఈ టికెట్‌ను తీసుకోకపోతే ఏం జరుగుతుంది. ఫ్లాట్ ఫామ్ టికెట్ వెనక అసలు ఉద్దేశం ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఫ్లాట్ ఫామ్ టికెట్ ప్రధాన ఉద్దేశం
ఫ్టాట్ ఫామ్ టికెట్ ప్రధాన ఉద్దేశం రైల్వే స్టేషన్‌లో రద్దీని తగ్గించడమే. రైళ్లల్లో ప్రయాణం చేయని వ్యక్తులు వారి బంధువులను సాగనంపేందుకు స్టేషన్లకు వస్తుంటారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లలో రద్దీ అధికంగా ఉంటుంది. రద్దీని నివారించడానికే ఫ్లాట్‌ఫామ్ టికెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 1950 నుంచి ఈ విధానం అమలులో ఉంది. రద్దీని నియంత్రించడానికి, భద్రతను పెంపొందించడానికే ఈ విధానాన్ని రూపొందించారు. న్యూఢిల్లీ, హౌరా, చెన్నై సెంట్రల్ వంటి పెద్ద స్టేషన్‌లలో రోజుకు లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. వీరిని సాగనంపేందుకు చాలా మంది వస్తుంటారు. ఈ క్రమంలో ఫ్లామ్‌ఫామ్‌ను టికెట్‌ను కచ్చితం చేశారు. ఈ టికెట్ లేకుండా ప్రవేశిస్తే రద్దీ అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ టికెట్ తీసుకున్న వారి వివరాలు రికార్డు అవుతాయని.. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడంలో సహాయపడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
టికెట్ తీసుకోకపోతే జరిగే పరిణామాలు
ఫ్లాట్‌ఫామ్ టికెట్ లేకుండా రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశిస్తే జరిమానా తప్పదు. భారత రైల్వే చట్టం 1989, సెక్షన్ 55 ప్రకారం ఫ్లాట్ ఫామ్ టికెట్ లేకుండా ప్రవేశం నిషేధం. ఫ్లాట్‌ఫామ్ టికెట్ లేని వారు టికెట్ చెకింగ్ సిబ్బందికి చిక్కితే..రూ.250 నుంచి రూ.500 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. జరిమానాను చెల్లంచని పక్షంలో చట్టమైన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. లేదా స్టేషన్ నుంచి బయటకు పంపించేస్తారు. అంతే కాకుండా టికెట్ లేని వ్యక్తులను అనుమానాస్పదంగా భావించి వారిని విచారించే అవకాశమూ ఉంటుంది. అయితే కొన్ని రైల్వేస్టేషన్‌లలో టికెట్ కౌంటర్లు లేక, ఆన్‌లైన్ టికెట్ సౌలభ్యం సరిగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి.
ఈ టికెట్ నుంచి మినాహాయింపు ఎవరికంటే
ఫ్లాట్‌ఫామ్ టికెట్ విషయంలో పలువురికి మినహాయింపులు కూడా ఉన్నాయి. వికలాంగులు, వృద్ధులు, అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారు ఆర్‌పీఎఫ్ అనుమతితో ఫ్లాట్‌ఫామ్ పైకి వెళ్లే వెసులుబాటు ఉంటుంది. కరోనా సమయంలో (2020-2022) రద్దీని తగ్గించేందుకు ఫ్లాట్‌ఫామ్ టికెట్ విక్రయాలను తాత్కాలింకంగా నిలిపివేశారు. కరోనా అనంతరం ఫ్లాట్ ఫామ్ టికెట్ యధావిధిగా ప్రారంభమయ్యాయి. యూటీఎస్ యాప్ ద్వారా కూడా ఫ్లాట్‌ఫామ్ టికెట్‌ను కొనుక్కునే వెసులుబాటును కల్పించింది రైల్వే శాఖ.
ప్రజలు ఏమంటున్నారు
కాగా.. ఫ్లాట్‌ఫామ్ టికెట్‌కు సంబంధించి ప్రజల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. రద్దీని తగ్గించేందుకు ఫ్లాట్‌ఫామ్ టికెట్‌లు ఉపయోగపడతాయని.. కానీ చిన్న స్టేషన్‌లలో ఈ టికెట్ అవసరం లేదని కొందరు చెబుతుండగా... టికెట్ కౌంటర్ల వద్ద క్యూలు, ఆన్‌లైన్ సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు మరికొందరు చెబుతున్నారు.
ఫ్లాట్‌ఫామ్ టికెట్ అనేది రైల్వేస్టేషన్‌లో రద్దీని, భద్రతా పరమైన సమస్యలను నియంత్రించేందుకు రూపొందిన విధానం. ఈ టికెట్‌ను తీసుకోకపోతే జరిమానా తప్పదు. అలాగే ఈ విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు ఆన్‌లైన్ సౌకర్యాన్ని మెరుపరిస్తే ప్రజలకు ఇబ్బందులు అవకాశం ఉంటుంది. ఈ టికెట్ విధానం ద్వారా రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని, భద్రతను కాపాడుతూనే ప్రయాణికుల సౌలభ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి అవసరం ఉంది.
ఇవి కూడా చదవండి
Stock Market Opening Bell: మిశ్రమంగా మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Fire Accident: సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం..
Read Latest Business News And Telugu News