America: ప్రస్తుత స్థితిని లైట్ తీసుకుంటున్న అధ్యక్షుడు ట్రంప్
ABN , Publish Date - Apr 04 , 2025 | 08:51 AM
అమెరికా అధ్యక్షుడు తెచ్చిన సుంకాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అధికంగా అతలాకుతలం చేస్తుంటే, ట్రంప్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన కొత్త సుంకాలు ఆ దేశ మార్కెట్లను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి క్రాష్ తర్వాత ఇంతలా అమెరికా మార్కెట్లు పడిన సందర్భాలు లేవు. ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా విధించిన సుంకాలు అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలకు కలిగించే విధ్వంసం గురించి రేకెత్తిన ఆందోళనలతో అన్ని మార్కెట్లు రెడ్ లోనే కొనసాగుతున్నాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే అమెరికా వాల్ స్ట్రీట్ ఒక్కసారిగా కంపించింది. S&P 500 సూచీ 4.8 శాతం క్షీణించింది. ఇది ప్రధాన యూరోపియన్, ఆసియా మార్కెట్ల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఇది 2020లో కోవిడ్ ఎఫెక్ట్ వల్ల మార్కెట్ పతనం తర్వాత అంతటి షాకింగ్ డే ను సూచిస్తుంది.
డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1,679 పాయింట్లు (లేదా 4.14 శాతం) పడిపోయింది. నాస్డాక్ కాంపోజిట్ 6 శాతం పడిపోయింది. ట్రంప్ సుంకాల ప్రభావంతో అమెరికా ఆర్థిక వృద్ధి బలహీనపడుతుందని, ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందనే భయాలే అమెరికా మార్కెట్లను పాతాళానికి తొక్కుతున్నాయి. అమెరికా లోని బడా టెక్ సంస్థల స్టాక్‌ల నుండి ముడి చమురు వరకు అన్ని స్టాక్స్ భారీగా నష్టపోతున్నాయి. ఇతర కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ విలువ కూడా తగ్గిపోవడం గమనార్హం. అటు, అమెరికా స్మాల్ క్యాప్ రస్సెల్ 2000 ఇండెక్స్ 6.6 శాతం అంటే రికార్డు స్థాయిలో20 శాతం కంటే ఎక్కువ పడిపోయింది.
ట్రంప్ సుంకాల ప్రభావం S&P 500 ఇండెక్స్ మీదా తీవ్రంగా పడింది. ఇది ఆల్-టైమ్ గరిష్ట స్థాయి కంటే 10 శాతం తక్కువగా ఉంది. UBS ప్రకారం తాజా టారిఫ్స్ వల్ల ఈ ఏడాది అమెరికా ఆర్థిక వృద్ధిని 2 శాతం తగ్గించగలవని, ద్రవ్యోల్బణం 5 శాతానికి దగ్గరగా పెరుగుతుందని అమెరికాలోని కొన్ని ఆర్ఠిక సంస్థలు లెక్కలు కడుతున్నాయి. అయితే, అధ్యక్షుడు ట్రంప్ దీనిని లైట్ తీసుకుంటున్నారు. కొత్తగా తెచ్చిన టారిఫ్స్ అమెరికా ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లలో కొంచెం గందరగోళాన్ని కలిగిస్తాయని, అయితే, తర్వాత పరిస్థితి చక్కబడుతుందని ట్రంప్ ధీమాగా ఉన్నారు. "మార్కెట్లు పుంజుకోబోతున్నాయి, స్టాక్ పుంజుకోబోతోంది అమెరికా పుంజుకోబోతోంది" అని ట్రంప్ గురువారం వైట్ హౌస్ నుండి ఫ్లోరిడాకు బయలుదేరి వెళ్లే సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest AP News And Telugu News