Share News

Cyber crime: మనీ ల్యాండరింగ్‌ పేరుతో.. వృద్ధుడికి రూ.9.5 లక్షల టోకరా

ABN , Publish Date - Dec 31 , 2024 | 10:27 AM

‘మనీ ల్యాండరింగ్‌(Money laundering) కేసులో మీ ఖాతాకు నగదు బదిలీ జరిగింది..’ అని బెదిరిస్తూ.. ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పేరుతో సైబర్‌ కేటుగాళ్లు ఓ వృద్ధుడి నుంచి రూ.9.5లక్షలను కొల్లగొట్టారు.

Cyber crime: మనీ ల్యాండరింగ్‌ పేరుతో.. వృద్ధుడికి రూ.9.5 లక్షల టోకరా

హైదరాబాద్‌ సిటీ: ‘మనీ ల్యాండరింగ్‌(Money laundering) కేసులో మీ ఖాతాకు నగదు బదిలీ జరిగింది..’ అని బెదిరిస్తూ.. ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పేరుతో సైబర్‌ కేటుగాళ్లు ఓ వృద్ధుడి నుంచి రూ.9.5లక్షలను కొల్లగొట్టారు. హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ సెల్‌ పోలీసు(Hyderabad Cybercrime Cell Police)ల కథనం ప్రకారం.. నగరానికి చెందిన 89 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి శనివారం వాట్సాప్‌ కాల్‌ వచ్చింది.

ఈ వార్తను కూడా చదవండి: New Year: సౌండ్‌ 45 డెసిబుల్స్‌కు మించొద్దు..


city9.2.jpg

పోలీసు యూనిఫాంలో ఉన్న అవతలి వ్యక్తి తనను తాను ముంబై క్రైమ్‌బ్రాంచ్‌(Mumbai Crime Branch) అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ‘మీ ఖాతా నుంచి అక్రమ లావాదేవీలు జరిగాయి. వాటికి మనీ ల్యాండరింగ్‌ కేసుతో లింకు ఉంది’ అని భయపెట్టాడు. డిజిటల్‌ అరెస్టు పేరుతో బెదిరించి.. రూ.9.5 లక్షలను బదిలీ చేయించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న చలి

ఈవార్తను కూడా చదవండి: మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు

ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో నక్సల్స్‌ కదలికలు?

Read Latest Telangana News and National News

Updated Date - Dec 31 , 2024 | 10:27 AM