Dhanteras 2024: ధనత్రయోదశి నుంచి దశ తిరగనున్న రాశులివే..
ABN , Publish Date - Oct 18 , 2024 | 05:52 PM
లక్ష్మీ దేవితోపాటు కుబేరుడిని సైతం భక్తులు పూజిస్తారు. ఇంకా చెప్పాలంటే దీపావళికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. ధనత్రయోదశికి సైతం అంతే ప్రాముఖ్యత ఉంది. అయితే దీపావళి రోజు కొన్ని యోగాలు ఏర్పడనున్నాయి. దీని వల్ల కొన్ని రాశుల వారికి దశ తిరగనుంది.
అక్టోబర్ 31వ తేదీ దీపావళి.ఈ పండగ ముందు ధన త్రయోదశి 29వ తేదీన వచ్చింది. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఆ రోజు శ్రీలక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే బంగారాన్ని సైతం కోనుగోలు చేస్తారు. దీంతో బంగారం షాపులు కొనుగోలుదారులతో ధన త్రయోదశి రోజు కిటకిటలాడతాయి. లక్ష్మీ దేవి రూపు, బంగారం కడ్డి లేకుంటే బంగారు నగ అయిన కోనుగోలు చేస్తారు.
ఈ రోజు లక్ష్మీ దేవితోపాటు కుబేరుడిని సైతం భక్తులు పూజిస్తారు. ఇంకా చెప్పాలంటే దీపావళికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. ధనత్రయోదశికి సైతం అంతే ప్రాముఖ్యత ఉంది. అయితే దీపావళి రోజు కొన్ని యోగాలు ఏర్పడనున్నాయి. దీని వల్ల కొన్ని రాశుల వారికి దశ తిరగనుంది. జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం.. ఆయా రాశుల వారికి కోరుకున్న కోరికలు సైతం నెరవేరుతాయని వారు స్పష్టం చేస్తున్నారు.
Also Read: Atla Tadde: ఆ దోషం తొలగాలంటే.. అట్లతద్ది రోజు ఇలా చేయండి..
సింహ రాశి
ఈ రాశి వారికి.. కుటుంబంలో నెలకొన్న చిన్నపాటి మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య శాంతి నెలకొంటుంది. దాంపత్య జీవితం సైతం సంతోషంగా సాగుతుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. విద్యార్థులకు ఈ సమయంలో లాభాలు కలుగుతాయి. ఎంతోకాలం నుంచి విదేశాలకు వెళ్లాలను కుంటున్న వారు ఈ సమయంలో గట్టిగా ప్రయత్నాలు చేస్తే... విదేశీయానం తప్పక కలుగుతుంది.
మకర రాశి
ఈ రాశి వారికి మహార్దశ పట్టనుంది. పనులన్నీ సులువుగా జరిగిపోతాయి. ఎంతో కాలంగా తిష్ట వేసుకున్న సమస్యలు సైతం ఇట్టే తొలగిపోతాయి. సంపాదనకు ఏ మాత్రం లోటు ఉండదు. పడిన శ్రమను బట్టి ఫలితం అందుకుంటారు. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంది. గతంలో అనుకుంటున్న పనులు ఈ సమయంలో సానుకూల పడతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. జీవితం సైతం సంతోషంగా నడుస్తుంది.
మేష రాశి..
మేష రాశి వారికి కేరీర్ పరంగా జీవితంలో ఊహించని రీతిలో మార్పులు వస్తాయి. అలాగే సంపద సైతం ఊహించని రీతిలో పెరుగనుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. అలాగే వ్యాపారస్తులకు సైతం అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితం సైతం సజావుగా సాగుతుంది.
దీపావళి రోజు..
ఈ రోజు లక్ష్మీ పూజ సాయంత్రం 6.52 గంటల నుంచి 8.41 గంటల మధ్య చేసుకోవాలి
ప్రదోష కాలం: సాయంత్రం 6:10 నుంచి 8:52 మధ్య జరుపుకోవాలి.
వృషభ కాలం: సాయంత్రం 6:52 నుంచి 8:41 మధ్య చేసుకోవాలి.
అమావస్య తిథి: అక్టోబర్ 31వ తేదీ ఉదయం 6.22 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి నవంబర్ 1వ తేదీ ఉదయం 8: 46కి ముగుస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తలతోపాటు తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..