Share News

CM Chandrababu: ఉద్యోగుల బకాయిలు 6,200 కోట్లు చెల్లించండి

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:12 AM

ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.

CM Chandrababu: ఉద్యోగుల బకాయిలు  6,200 కోట్లు చెల్లించండి

  • ఆర్థిక శాఖకు చంద్రబాబు ఆదేశం

  • గత ప్రభుత్వంలో పెండింగ్‌

అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రూ.6,200 కోట్ల మేర ఉద్యోగుల బిల్లులు చెల్లించాలని శుక్రవారం ఆర్థిక శాఖను ఆదేశించారు. ఈ బకాయిలన్నీ సీపీఎస్‌, జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐకి సంబంధించినవని ప్రభుత్వం ప్రకటించింది. గత జగన్‌ ప్రభుత్వం వీటిని బకాయి పెట్టింది. ఈ ఏడాది జనవరిలోనూ ఉద్యోగులకు వివిధ పెండింగ్‌ బకాయిల కింద కూటమి ప్రభుత్వం రూ.1,033 కోట్లు చెల్లించింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోంది. వైసీపీ హయాంలో ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు రూ.25,000 కోట్లకు చేరాయి. ఇప్పుడు ఆ పెండింగ్‌ బిల్లులనే విడతల వారీగా ప్రభుత్వం చెల్లిస్తోంది.

Updated Date - Mar 21 , 2025 | 04:12 AM