Share News

Today Horoscope : ఈ రాశి వారికి ఖర్చులు అధికం

ABN , Publish Date - Oct 01 , 2024 | 06:28 AM

నేడు (01-10-2024-మంగళవారం) కొత్త పరిచయాలు ఆనందం కలిగిస్తుంది. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది.

Today Horoscope : ఈ రాశి వారికి  ఖర్చులు అధికం

నేడు (01-10-2024-మంగళవారం) కొత్త పరిచయాలు ఆనందం కలిగిస్తుంది. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

కొత్త పరిచయాలు ఆనందం కలిగిస్తుంది. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది. కంపెనీలు, వ్యవసాయం, హోటల్‌ రంగాల వారు భాగస్వామి నుంచి చిక్కులు ఎదుర్కొంటారు. విందు వినోదాల్లో ఖర్చులు అధికం. శ్రీ సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.


MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతమలు ఆరోగ్యం కలవరపెడుగుంది. క్రీడలు, బ్యాంకులు, చిట్‌ఫండ్‌లు, విద్యా రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.


MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

దూరంలో ఉన్న ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆద్దె, స్థలం కొనుగోలు విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించండి.


MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి అడుగువేయాలి. ఇల్లు, స్థలసేకరణకు సంబంధించిన చర్చలకు తగిన సమయం కాదు. ప్రయాణాల్లో నిదానం పాటించాలి. తోబుట్టవులతో కుటుంబ విషయాలు చర్చకు వస్తాయి. లక్ష్మీనరసింహ స్తోత్ర పారాయణ శుభప్రదం.


MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రుల కోసం ఖర్చులు అంచనాలు మించిపోతాయి. పెట్టుబడులకు సంబంధించిన పత్రాల విషయంలో జాగ్రత్తలు అవసరం. బిల్లులు, ఫీజులు చెల్లించేందుకు సకాలంలో నిధులు అందుకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం.


MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తగవు. ధనార్జనకు సంబంధించిన కొత్త ఆలోచనలు చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్‌ చాలీసా పారాయణ శుభప్రదం.


MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

వీసా, పాస్‌పోర్డ్‌ వ్యవహారాల్లో ఆనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. రాజకీయ, సినీ, న్యాయ రంగాల వారు ఆచితూచి ముందడుగు వేయాలి. లక్ష్య సాధనకు అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. మనసు చికాకుగా ఉంటుంది. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.


MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

సన్నిహితుల ఆంతరంగిక విషయాలపై దృష్టి పెడతారు. ఆర్థిక విషయాల్లో అనుకోని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. బృంద కార్యక్రమాలు కోసం ఖర్చులు అఽధికం. విరాళాలు, దానధర్మాలకు వెచ్చిస్తారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన శుభప్రదం.


MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వేడుకల విషయంలో తల్లిదండ్రుల సహకారం లోపిస్తుంది. పదిమందిలో మీ గౌరవానికి భంగం కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయి. హనుమాన్‌ చాలీసా పారాయణం శుభప్రదం.


MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి రావచ్చు. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. అందుకోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. ప్రయాణాలు, చర్చలు మంచి ఫలితాలనిస్తాయి. పెద్దల సహకారంతో ఉన్నత విద్యాపరమైన లక్ష్యాలు సాధిస్తారు.


MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

పన్నులు, బీమా, పెన్షన్‌కు సంఽబంధించిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రుల ఆరోగ్యం కలవరపెడుతుంది. బిల్లులు, ఫీజుల చెల్లింపులకు కావలసిన నిదులు సర్దుబాటవుతాయి. సుబ్రహ్మణ్య కవచ పారాయణ శుభప్రదం.


MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఖర్చులు అంచనాలు మించతుతాయి. శ్రీవారు, శ్రీమతి ఆరోగ్యం కలవరపెడుతుంది. పెట్టుబడులకు సంబంధించిన కీలక నిర్ణయాలకు ఇది తగిన సమయం కాదు. ఆర్థిక విషయాల్లో బందుమిత్రుల వైఖరి ఆ వేదన కలిగిస్తుంది. దుర్గామాత ఆలయ దర్శనం శుభప్రదం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Oct 01 , 2024 | 06:28 AM