Share News

Video Call: వీడియో కాల్‌లో గొడవ.. భార్య చూస్తుండగానే..

ABN , Publish Date - Apr 04 , 2025 | 10:01 PM

Kanpur Man Video Call: భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఎనిమిది నెలల క్రితం రాధ పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత రాలేదు. గురువారం ఇద్దరూ ఫోన్ కాల్ ద్వారా గొడపడ్డారు. తర్వాత అతడు వీడియో కాల్ చేశాడు.

Video Call: వీడియో కాల్‌లో గొడవ.. భార్య చూస్తుండగానే..
Kanpur Man

భార్యా భర్తల మధ్య గొడవలు సహజం. అయితే, ఆ గొడవలకు కూడా ఓ హద్దు ఉంటుంది. ఎన్ని గొడవలు వచ్చినా.. భార్యాభర్తలు కాడెద్దుల్లా ముందుకు సాగాలి. లేకపోతే కాపురం నాశనం అవుతుంది. పరిస్థితులను బట్టి ఎవరో ఒకరు వెనక్కు తగ్గుతూ ఉండాలి. లేకపోతే.. దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. తాజాగా, భార్యను పుట్టింటికి రప్పించే ప్రయత్నంలో ఓ భర్త దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆమెను భయపెట్టాలని చేశాడో లేక.. నిజంగానే ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడో తెలీదు కానీ.. భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ కత్తితో పొడుచుకుని చనిపోయాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన దినేస్ అనే యువకుడికి ఫతేపుర్‌కు చెందిన రాధ అనే యువతితో 2023 జూన్ నెలలో పెళ్లయింది. పెళ్లయిన కొన్ని రోజులు వీరి కాపురం బాగానే సాగింది. తర్వాతినుంచి గొడవలు మొదలయ్యాయి. ఇద్దరూ తరచుగా ఏదో ఒక విషయంపై గొడవపడేవారు. భార్య వేరుకాపురం పెడదామని పోరు పెట్టడటంతో బరదేవిలో ఇళ్లు తీసుకుని అక్కడికి మారిపోయారు. వేరు కాపురం పెట్టిన తర్వాత గొడవలు మరింత పెరిగాయి. 8 నెలల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ తర్వాత రాధ కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి మళ్లీ తిరిగిరాలేదు. ఇద్దరూ దూరంగా ఉన్నా కూడా..


ఫోన్ కాల్స్ ద్వారా గొడవపడుతూనే ఉండేవారు. గురువారం రోజు అతడామెకు వీడియో కాల్ చేశాడు. వీడియో కాల్‌లో ఉండగానే కత్తితో తనను తాను పొడుచుకున్నాడు. రాధ గట్టిగా అరవటంతో కుటుంబసభ్యులు అతడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. దినేష్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దినేస్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తేల్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దినేష్ మరణంపై అతడి తల్లి మాట్లాడుతూ.. ‘ రాధ నా కొడుకును తరచుగా కొట్టేది. అతడ్ని సరిగా పట్టించుకునేది కాదు. దీంతో నా కొడుకు మానసికంగా కృంగిపోయాడు’ అంటూ కన్నీరు మున్నీరైంది.


ఇవి కూడా చదవండి:

Supreme Court: గ్రూప్-1 నియామకాలకు లైన్ క్లియర్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

Earthquake: నేపాల్‌లో భూకంపం..ఉత్తర భారత్‌లోనూ ప్రకంపనలు

Updated Date - Apr 04 , 2025 | 10:01 PM