Today Horoscope: ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:02 AM
నేడు 28-03-2025 శుక్రవారం, ప్రయాణాలకు అనుకూల సమయం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.

నేడు 28-03-2025 శుక్రవారం, ప్రయాణాలకు అనుకూల సమయం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాలు, చర్చల్లో నిదానం పాటించండి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. ఉన్నత విద్య విదేశీ ప్రయాణాల విషయాల్లో కొంత అసౌకర్యం కలుగుతుంది. సినీ, రాజకీయ రంగాల వారు కొత్త ప్రయాగాలు చేసేందుకు తగిన సమయం కాదు.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్యకు రుణాలు మంజూరవుతాయి. బృందకార్యక్రమాలు, సమావేశాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. బంధుమిత్రుల వైఖరి ఆవేదన కలగిస్తుంది. దుర్గామాతను ఆరాధించండి.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
మీ గౌరవానికి భంగం కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక విషయాల్లో పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. సమావేశాలు, బృందకర్యాక్రమాల్లో పాల్గొంటారు. అందుకోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. లలితా దేవిని ఆరాధించండి
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. ప్రయాణాలు, చర్చల్లో జాగ్రత్త అవసరం. రాజకీయ, న్యాయ, బోధన రంగాలకు చెందిన వారు ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. కళారంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. గాయత్రీ మాత ఆరాధన శుభప్రదం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
పన్నుల వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెట్టుబడులు, రుణాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలకు అనుకూల సమయం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. వడ్డీలు, పారితోషికాలు అందుకుంటారు. పెన్షన్, బీమా పనులు పూర్తవుతాయి.
కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు, పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సలహాలు పాటిస్తారు. వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. లలితా దేవిని ఆరాదించండి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
లక్ష్య సాధనలో భాగస్వామి సహకారం లభిస్తుంది. ప్రియతముల ఆరోగ్యం కొంత కలవరపెడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. దుర్గాష్టక పారాయణ శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం కొంత కలవరపెడుతుంది. టెలివిజన్, క్రీడలు, అడ్వర్టయిజ్‌మెంట్, ఆడిటింగ్ రంగాల వారికి అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. దుర్గామాతను ఆరాధించండి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఇంటి కోసం ఖర్చులు అంచనాలు మించిపోతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు జాగ్రత్త పాటించాలి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. గాయత్రీ మాతను ఆరాధించండి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
చర్చలు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వస్తువుల రవాణా విషయంలో ఆసౌకర్యం కలిగే అవకాశం ఉంది. సన్నిహితులు, మిత్రుల వైఖరిలో మార్పు మీ మనసును బాధపెడుతుంది. గోమాత ఆరాధన శుభప్రదం
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పెట్టుబడులకు సంబంధించిన పత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైన వస్తువుల రవాణా విషయంలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. బిల్లులు, చెక్కుల విషయాల్లో జాగ్రత్త అవసరం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఖర్చులు అంచనాలు మించే ప్రమాదం ఉంది. సౌందర్య లహరీ పారాయణ శుభప్రదం.