Tonbo: శత్రు దేశాల నుంచి రక్షణ కోసం.. రూ. 175 కోట్లు సేకరించిన టోన్‌బో
ABN , Publish Date - Apr 04 , 2025 | 09:43 PM
Tonbo:"భవిష్యత్ డిఫెన్స్ టెక్నాలజీకి టోన్‌బో ఇమేజింగ్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇమేజింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానామస్ సిస్టమ్స్‌లో అపార అనుభవం ఉన్న టోన్‌బో ఇమేజింగ్ వర్ధమాన అంతర్జాతీయ భద్రతా సవాళ్లను పరిష్కరించే విధంగా పటిష్టమైన స్థితిలో ఉంది.

న్యూఢిల్లీ: డిఫెన్స్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థ టోన్‌బో ఇమేజింగ్ సంస్థ ప్రీ-ఐపీవో ఫండింగ్‌లో భాగంగా ఫ్లోరిన్‌ట్రీ అడ్వైజర్స్, టెనేసిటీ వెంచర్స్, ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ.175 కోట్లు సమీకరించింది. ఈ నిధులను ఆధునిక యుద్ధ పద్ధతుల్లోని ముప్పులను సమర్ధవంతంగా ఎదుర్కొనగలిగే కొత్త తరం ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ల అభివృద్ధికి, అత్యంత శక్తివంతమైన మైక్రోవేవ్ టెక్నాలజీల వినియోగానికి, అంతర్జాతీయ కార్యకలాపాల విస్తరణకు ఉపయోగిస్తుంది. వేగంగా వృద్ధి చెందుతున్న C4ISR మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఐపీవోకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న టోన్‌బో సంస్థకు ఈ నిధుల సమీకరణ కీలకంగా మారింది.
ఇదివరకు టోన్‌బో.. ఆర్టిమాన్, క్వాల్‌కామ్, సెలెస్టా, ఎడెల్వీజ్, హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ వంటి ఇన్వెస్టర్ల నుండి రూ.300 కోట్లు సమీకరించింది. ఈ కంపెనీ టెక్నాలజీని 30 పైగా దేశాల రక్షణ బలగాలు ఉపయోగిస్తున్నాయి. ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్), యూ.ఎస్. నేవీ సీల్స్, నాటో, ఆర్మేనియా రక్షణ శాఖ, భారతీయ రక్షణ శాఖ ఈ జాబితాలో ఉన్నాయి. "అధునాతన డిఫెన్స్ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో టోన్‌బో ఏర్పాటైంది.
ఆధునిక యుద్ధ రీతులు పెరుగుతున్న నేపథ్యంలో మెరుగైన సెన్సార్లు, తక్కువ విద్యుత్తును ఉపయోగించే కంప్యూటర్ విజన్, సంప్రదాయేతర ఆయుధాలు కీలకం. ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్, డైరెక్టెడ్ ఎనర్జీ సొల్యూషన్స్‌లో కొత్త ఆవిష్కరణలు చేయడానికి, అంతర్జాతీయంగా కార్యకలాపాలు విస్తరించడానికి ఈ పెట్టుబడులు ఉపయోగపడతాయి. ప్రపంచవ్యాప్తంగా రక్షణ బలగాలకు తక్కువ ఖర్చుతో కూడిన, అధునాతన భద్రతా సాధనాలను అందించడంపై దృష్టి పెడుతున్నాం" అని టోన్‌బో ఇమేజింగ్ వ్యవస్థాపకుడు, సీఈవో అరవింద్ లక్ష్మీకుమార్ తెలిపారు.
"భవిష్యత్ డిఫెన్స్ టెక్నాలజీకి టోన్‌బో ఇమేజింగ్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇమేజింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానామస్ సిస్టమ్స్‌లో అపార అనుభవం ఉన్న టోన్‌బో ఇమేజింగ్ వర్ధమాన అంతర్జాతీయ భద్రతా సవాళ్లను పరిష్కరించే విధంగా పటిష్టమైన స్థితిలో ఉంది. భారత్‌కి చెందిన గ్లోబల్ టెక్ వ్యాపార సంస్థ పటిష్టంగా విస్తరించేందుకు అరవింద్, ఆయన మేనేజ్‌మెంట్ బృందంతో చేతులు కలపడంపై ఆసక్తిగా ఉన్నాం" అని ఫ్లోరిన్‌ట్రీ క్యాపిటల్ వ్యవస్థాపకుడు మాథ్యూ సిరియాక్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News