RK Kotha Paluku : అహంకారం.. హాహాకారం!
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:56 AM
జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పరోక్షంగా అంటకాగిన సీపీఎం నాయకులు ఇప్పుడు జెండాలను బయటకు తీసి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జగన్‌రెడ్డి పార్టీతో పరోక్షంగా స్నేహం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్
జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పరోక్షంగా అంటకాగిన సీపీఎం నాయకులు ఇప్పుడు జెండాలను బయటకు తీసి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జగన్‌రెడ్డి పార్టీతో పరోక్షంగా స్నేహం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సమాజంలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? సోషల్ మీడియా సైకోలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై జగన్‌రెడ్డి మాత్రమే గుండెలు బాదుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రహస్యంగా అండదండలు అందించిన సీపీఎం కూడా ఈ విషయంలో జగన్‌తో గొంతు కలపలేని పరిస్థితి. సోషల్ మీడియా సైకోలు చేసిన అరాచకాలను తెలుసుకున్న కొద్దీ ప్రజల్లో ఏవగింపు పెరుగుతోంది. ప్రాథమిక హక్కులు అంటే ఇళ్లలోని ఆడవాళ్లకు రంకులు అంటకట్టడం కాదు కదా?
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కమ్యూనిస్టులు విలక్షణ పాత్ర పోషించే వారు. రాష్ట్ర విభజన తర్వాత వారి ప్రాధాన్యం తగ్గిపోయింది. కమ్యూనిస్టులకు కేసీఆర్ కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. ప్రజా సమస్యల గురించి వివరించడానికి సమయం కోరినా నిరాకరించారు. అదే కేసీఆర్‌కు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కమ్యూనిస్టుల అవసరం ఏర్పడింది. అంతే... వారిని ఆహ్వానించి భోజనాలు పెట్టారు. ఆ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల సహకారంతో బయటపడ్డారు. ఆ తర్వాత సాధారణ ఎన్నికల వరకు వారి ముఖం చూడలేదు. మునుగోడులో అవగాహన కుదుర్చుకున్నట్టుగానే సాధారణ ఎన్నికల్లోనూ కేసీఆర్ తమతో పొత్తు కుదుర్చుకుంటారని కమ్యూనిస్టులు భావించారు. అయితే, తనకు కమ్యూనిస్టుల అవసరం లేదని భావించిన కేసీఆర్ వారిని కనీసం కలుసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. దీంతో సీపీఐ నాయకులు కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టారు. సీట్ల పంపకంలో పేచీ ఏర్పడటంతో సీపీఎం విడిగా పోటీచేసింది.
గడచిన పదేళ్లలో దేశ రాజకీయాల స్వరూప స్వభావాలు మారిపోయాయి. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి అధికారాన్ని వాడటం పరిపాటిగా మారింది. ఈ విషయంలో ఇటు కేసీఆర్, అటు జగన్‌రెడ్డి సరికొత్త రికార్డులను నెలకొల్పారు.
విజయసాయీ, నువ్వు ఆరోపించినట్టుగా నేను వెధవ పనులు చేసి ఉన్నా, ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధి పొంది ఉన్నా జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నన్ను వదిలిపెట్టేవారా? ఎంతగా రంధ్రాన్వేషణ జరిపినా ఏమీ దొరకనందునే కదా నా మీద ఒక్క కేసూ పెట్టలేక పోయారు. ప్రభుత్వాలకు ఎదురు వెళ్లడానికి నైతిక బలం ఉండాలి. అది నాకు పుష్కలంగా ఉంది. నీకు ఆ నైతిక బలం లేనందునే కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ల కాళ్లు పట్టుకుంటావు. నీచ్ కమీన్ విజయసాయికి తెలియనిది ఏమిటంటే ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికను నేను ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ విషయం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియనే తెలియదు. మూతపడిన పత్రిక కార్యాలయాలను తెరిచిన తర్వాత మాత్రమే రాజశేఖరరెడ్డితోపాటు చంద్రబాబును కలసి విషయం చెప్పాను.
‘జగన్‌రెడ్డి నన్ను నమ్మడం లేదు, దూరం పెట్టాడు’ అని కనిపించిన వారందరి దగ్గరా ఏడ్చే నువ్వో రాజకీయ వ్యభిచారివి. ‘నువ్వు నమ్మదగిన వ్యక్తివి కావు– మోసగాడివి’ అని కేంద్ర హోం మంత్రి నిన్ను ఉద్దేశించి అనడం నిజం కాదా? అయినా ‘ఓపెన్ హార్ట్’ ప్రోగ్రాంకు సిద్ధంగా ఉండు. అన్ని విషయాలూ అక్కడే తేల్చుకుందాం.
ఉభయ తెలుగు రాష్ర్టాలలో ప్రజాగ్రహం కారణంగా అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి నెట్టివేయబడిన భారత రాష్ట్ర సమితి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుల హాహాకారాలు మిన్నంటుతున్నాయి. తెలంగాణలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారంలో కొనసాగిన కేసీఆర్ అండ్ కోలో అహంకారం పరాకాష్ఠకు చేరడంతో తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉండిన జిల్లాల ప్రజానీకం భారత రాష్ట్ర సమితికి గట్టి గుణపాఠం చెప్పింది. అధికారంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా అహంకార పూరితంగా వ్యవహరించిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దీన్నే కాల మహిమ అంటారు. ధర్మో రక్షతి రక్షితః అంటారు. అధికారంలో ఉన్నప్పుడు తాము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న వాస్తవాన్ని విస్మరించి నియంతలా వ్యవహరించిన వారు ఇప్పుడు ‘ఇదెక్కడి ప్రజాస్వామ్యం?’ అంటూ గతం మరచిపోయి మాట్లాడుతున్నారు. తాము శాశ్వతంగా అధికారంలో కొనసాగుతామని నమ్మి విర్రవీగిన బీఆర్‌ఎస్, వైసీపీ నాయకులు ఇప్పుడు ‘అధికారం శాశ్వతం కాదు’ అని సూక్తులు చెబుతున్నారు. రాజకీయాలలో వ్యక్తిగత కక్షలకు తావు ఉండకూడదు. కానీ.. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందేమిటి? రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా ప్రకటించుకొని వేటాడారు. ఈ క్రమంలో వ్యవస్థలను, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించారు. ఇప్పుడు పోలీసులు అధికార పక్షానికి తొత్తులుగా మారారని సుద్దులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
మారిన కాలం...
గడచిన పదేళ్లలో దేశ రాజకీయాల స్వరూప స్వభావాలు మారిపోయాయి. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి అధికారాన్ని వాడటం పరిపాటిగా మారింది. ఈ విషయంలో ఇటు కేసీఆర్, అటు జగన్‌రెడ్డి సరికొత్త రికార్డులను నెలకొల్పారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడంతో ‘అధర్మం రాజ్యమేలుతోంది’ అని గుండెలు బాదుకుంటున్నారు. తెలుగునాట ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నది కేసీఆర్, జగన్‌రెడ్డి మాత్రమే. వారిరువురూ అధికారంలో ఉన్నప్పుడు వారి మీడియాకు అంతా పచ్చగా కనబడేది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడంతో సదరు మీడియాకు సర్వత్రా విధ్వంసమే కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వాల పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలలో వ్యక్తిగత కక్షలు తగవు అని మంచి మాటలు చెబితే చెవికి ఎక్కించుకోని వారు ఇప్పుడు గగ్గోలుపెడుతున్నారు. ముందుగా కేసీఆర్ విషయమే తీసుకుందాం! ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాజ్యానికి తాను ఒక చక్రవర్తిని అని భావించారు. ప్రతిపక్షాల ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడేవారు కారు. ప్రధాన అంశాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించడం అటుంచితే ప్రతిపక్షాలకు చెందిన వారికి వ్యక్తిగత అపాయింట్మెంట్లు కూడా ఇచ్చేవారు కారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కమ్యూనిస్టులు విలక్షణ పాత్ర పోషించేవారు. రాష్ట్ర విభజన తర్వాత వారి ప్రాధాన్యం తగ్గిపోయింది. కమ్యూనిస్టులకు కేసీఆర్ కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. ప్రజా సమస్యల గురించి వివరించడానికి సమయం కోరినా నిరాకరించారు. అదే కేసీఆర్‌కు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కమ్యూనిస్టుల అవసరం ఏర్పడింది. అంతే... వారిని ఆహ్వానించి భోజనాలు పెట్టారు. ఆ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల సహకారంతో బయటపడ్డారు. ఆ తర్వాత సాధారణ ఎన్నికల వరకు వారి ముఖం చూడలేదు. మునుగోడులో అవగాహన కుదుర్చుకున్నట్టుగానే సాధారణ ఎన్నికల్లోనూ కేసీఆర్ తమతో పొత్తు కుదుర్చుకుంటారని కమ్యూనిస్టులు భావించారు. అయితే, తనకు కమ్యూనిస్టుల అవసరం లేదని భావించిన కేసీఆర్ వారిని కనీసం కలుసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. దీంతో సీపీఐ నాయకులు కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టారు. సీట్ల పంపకంలో పేచీ ఏర్పడటంతో సీపీఎం విడిగా పోటీచేసింది. తెలంగాణ ఉద్యమంలో తనతో కలసి నడిచిన, తన ఎదుగుదలకు కారకులైన కోదండరాం వంటి వారందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ దూరం పెట్టారు. అధికారం శాశ్వతమని భావించి అందరినీ వదులుకొని, తానే ఒంటరివారు అయ్యారు. మీడియాను నయానో భయానో లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. తనకు నచ్చని అధికారుల ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడేవారు కారు. తండ్రి బాటలో కేటీఆర్, కవిత అధికారాన్ని గరిష్ఠంగా అనుభవించారు. ఈ క్రమంలో తాము ప్రజలకు దూరమవుతున్నామని గ్రహించలేక పోయారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని వ్యక్తిగత శత్రువుగా ప్రకటించుకున్నారు. పొరపాటున తాము ఓడినా, కాంగ్రెస్ పార్టీ గెలిచినా రేవంత్‌రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి కాకూడదని భావించారు.
తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్టుగా కాంగ్రెస్ గెలవడం, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనను వెంటాడి వేధించిన కేసీఆర్ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకొనే అవకాశం రేవంత్‌రెడ్డికి లభించింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ప్రధాన అజెండా అయ్యాయి. అటు కేసీఆర్ అండ్ కో, ఇటు రేవంత్ అండ్ కో కత్తులు దూసుకోవడం మొదలైంది. ఫలితంగా తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంది. ఎన్నికలు జరిగి ఏడాది కూడా పూర్తి కాకముందే తెలంగాణ రాజకీయాలు ఇంతలా మండటానికి కారణం.. రాజకీయ వైరం స్థానంలో వ్యక్తిగత వైరం ప్రవేశించడమే.
ఆందోళన... అయోమయం...
ఢిల్లీ లిక్కర్ కేసులో తన బిడ్డ కవిత తీహార్ జైలుకు వెళ్లాల్సి రావడంతో కేసీఆర్ కుంగిపోయారు. ఇప్పుడు ఫార్ములా వన్ రేసు వ్యవహారంలో కుమారుడు కేటీఆర్‌ను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏ క్షణాన్నయినా అరెస్టు చేయవచ్చునన్న వార్తలు రావడంతో ఆయన కలవరం చెందుతున్నారు. కేటీఆర్‌ను నిజంగా అరెస్టు చేస్తారా? చేస్తే ఎంతకాలం జైల్లో ఉండవలసి వస్తుంది? అని బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. అరెస్టుల పర్వం అంతటితో ఆగుతుందా? కేసీఆర్ వరకూ వెళుతుందా? అని బీఆర్‌ఎస్ ముఖ్యులు ఆరా తీస్తున్నారు. ఇటు రేవంత్‌రెడ్డి, అటు కేసీఆర్ కుటుంబం మధ్య వైరం ముదురుతున్నప్పటికీ, ఇది తగదు అని చెప్పే రాజకీయ పార్టీగానీ, వ్యక్తులుగానీ, వ్యవస్థలుగానీ తెలంగాణలో కనిపించడం లేదు. ఈ పరిస్థితికి కేసీఆర్ స్వయంకృతాపరాధమే కారణం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంఘాలను, ప్రజాస్వామ్య ప్రియులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు. గతంలో అధికార, ప్రతిపక్షాల మధ్య కీలక సందర్భాలలో మధ్యవర్తిత్వం నడిపిన కమ్యూనిస్టులను కూడా ఆయన అవమానించారు. దీంతో కేసీఆర్‌కు అండగా నిలబడేవారు కరువయ్యారు. విచిత్రం ఏమిటంటే, కేసీఆర్ కుటుంబానికి అరెస్టుల ముప్పు పొంచి ఉందని వార్తలు వెలువడుతున్నా ప్రజల్లో కూడా సానుభూతి ఏర్పడటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు ఆయన పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడింది. ఈ పరిస్థితి తెలంగాణలో కనిపించడం లేదు. కవిత నెలల తరబడి తీహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా ప్రజల్లో సానుభూతి కనిపించలేదు. తెలంగాణ జాతిపితగా ప్రకటించుకున్న తన కుటుంబాన్ని కష్టాలు చుట్టుముడుతున్నా ప్రజల్లో స్పందన ఎందుకు లేదో కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అధికారం శాశ్వతం కాదని అధికారంలో ఉన్నప్పుడు భావించి ఉన్నట్టయితే కేసీఆర్ కుటుంబానికి ఈ దుస్థితి వచ్చేది కాదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా వ్యవహరించే విషయమై పునరాలోచన చేయాలి. తన ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నందున ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతున్నదా? అదే నిజమైతే అందుకు కారణాలేమిటి? వంటి ప్రశ్నలు వేసుకొని సమీక్షించుకోవాలి. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్ల ప్రజల్లో సదభిప్రాయం ఉండేది. క్రమేపీ అది కనుమరుగవుతోందన్న వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ కుటుంబం పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడకపోయినా, ప్రభుత్వంపై సానుకూలత కొరవడటం రేవంత్‌రెడ్డికి నష్టం చేస్తుంది. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి పనితీరుపై కొన్ని వర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నందున రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పరిస్థితులను సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. తప్పొప్పులను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన తరుణం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం!
ఐదు నెలలకే అంత రచ్చ
చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలే అయింది. అయినప్పటికీ రాష్ట్రం అన్ని రంగాలలో అధోగతి పాలవుతోందని జగన్ అండ్ కో గగ్గోలుపెడుతున్నారు. చంద్రబాబు పాలనలో దమనకాండ పెచ్చరిల్లుతోందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా ఉన్మాదులపై చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని ప్రభుత్వం మరచిపోయినా ప్రజలు మాత్రం మరచిపోలేదు. ప్రజల ప్రాథమిక హక్కులను కూడా హరించిన జగన్‌రెడ్డి పాలనను ఎవరు మాత్రం ఎలా మరచిపోగలరు? ‘ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారా?’ అని ఇప్పుడు నీతి వాక్యాలు వల్లెవేస్తున్న జగన్ అండ్ కో మొన్నటిదాకా చేసిందేమిటి? ఈ ఐదు నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏం సాధించింది? ఏం సాధించలేదు? అన్న విషయం పక్కన పెడితే ప్రజలు మాత్రం స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. నీలి మీడియా, కూలి మీడియాకు ఇది కనిపించకపోవచ్చు. తెలంగాణలో వలె ఆంధ్రప్రదేశ్‌లో కూడా కమ్యూనిస్టులకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పరోక్షంగా అంటకాగిన సీపీఎం నాయకులు ఇప్పుడు జెండాలను బయటకు తీసి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జగన్‌రెడ్డి పార్టీతో పరోక్షంగా స్నేహం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సమాజంలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? సోషల్ మీడియా సైకోలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై జగన్‌రెడ్డి మాత్రమే గుండెలు బాదుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రహస్యంగా అండదండలు అందించిన సీపీఎం కూడా ఈ విషయంలో జగన్‌తో గొంతు కలపలేని పరిస్థితి. సోషల్ మీడియా సైకోలు చేసిన అరాచకాలను తెలుసుకున్న కొద్దీ ప్రజల్లో ఏవగింపు పెరుగుతోంది. ప్రాథమిక హక్కులు అంటే ఇళ్లలోని ఆడవాళ్లకు రంకులు అంటకట్టడం కాదు కదా? ఇతరుల మనోభావాలను గాయపరచడం ప్రాథమిక హక్కు కాబోదని తమిళనాడు హైకోర్టు మదురై బెంచ్ తాజాగా వ్యాఖ్యానించింది. పండు వృద్ధులని కూడా చూడకుండా ప్రముఖుల తల్లుల వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారికి ప్రాథమిక హక్కులు ఉండాలని జగన్‌రెడ్డి చెప్పగలరా? తన భార్య భారతిరెడ్డి వ్యక్తిత్వ హననానికి ఎవరైనా పాల్పడితే ఆయన సహించగలరా? ఇతరుల తల్లులు, భార్యలను అవమానించినప్పుడు వారికి కూడా అంతే బాధ కలుగుతుంది కదా? ఈ నేపథ్యంలో జగన్‌రెడ్డికి మద్దతుగా ఒక జర్నలిస్టు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు తీవ్రంగా స్పందించింది. హైకోర్టు న్యాయమూర్తులనూ వదలకుండా వేధించిన సోషల్ మీడియా సైకోలపై చర్యలు తీసుకోవద్దా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కారణంగానే జగన్ రోత మీడియా పేజీలకు పేజీలు అభూత కల్పనలతో కథనాలు వండి వార్చినా జగన్‌రెడ్డితో గొంతు కలిపేవారే కరువయ్యారు. అనాగరిక పాలన చేసిన జగన్‌రెడ్డి ఇప్పుడు ఎంతో కొంత ఫలితం అనుభవించాలి కదా?
‘హోదా’ కోసం బాధ
తాను 30 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతానని జగన్‌రెడ్డి నమ్మడమే కాకుండా, అలా అనేక కలలు కన్నారు. కానీ, ప్రజలు ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే శాసనసభకు హాజరు కాబోనని అంటున్న జగన్‌రెడ్డిని ఎలా అర్థం చేసుకోవాలి? 1994లో ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించకపోయినా అప్పుడు సీఎల్పీ నాయకుడిగా ఉన్న దివంగత పి.జనార్దన్‌రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేశారు. ‘‘నేను అంత.. నేను ఇంత’’ అని చెప్పుకొనే జగన్‌రెడ్డికి ఆ మాత్రం నైతిక ధైర్యం కూడా లేదే? శాసనసభలో చంద్రబాబును ఎదుర్కోలేరా? సభకు ముఖం చాటేయడం పిరికితనమే అవుతుంది. కుటుంబ సభ్యులను కూడా దూరం చేసుకున్న జగన్‌రెడ్డితో కేసీఆర్‌ను పోల్చలేము. కాకపోతే ఇద్దరు నాయకులూ నియంతృత్వ పోకడలతో ఒకరితో ఒకరు పోటీ పడి ప్రజలకు దూరమయ్యారు. ఇతర పక్షాల నుంచి నైతిక మద్దతు కూడా పొందలేని స్థితిలో ప్రస్తుతం ఉన్నారు. 30 ఏళ్లు అధికారంలో ఉంటామని ప్రగల్బాలు పలికిన జగన్ అండ్ కో ఇప్పుడు అధికారం శాశ్వతం కాదని సుద్దులు చెప్పడం కొసమెరుపు!
సాయిరెడ్డికి సవాల్...
రాజకీయాలలో అప్పుడప్పుడూ నీచత్వానికి పరాకాష్ఠ అనదగిన నికృష్టులు తారసపడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రస్తుతం అటువంటి నికృష్టుడిని విజయసాయిరెడ్డి రూపంలో చూడవచ్చు. కావ్య నాయిక చింతామణి మంచం కింద ఒకరిని, తలుపు చాటున మరొకరిని దాచిపెట్టేది. అలాగే విజయసాయి రెడ్డి కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీకి, నాయకుడు జగన్‌రెడ్డికి విధేయుడినని చెప్పుకుంటూనే... చీకటి మాటున ఇతర పార్టీల నాయకులను కలుసుకుంటుంటారు. ఏబీఎన్ చానల్‌లో ఏదో ఒక కార్యక్రమం ప్రసారమైందని, అందులో తనను విమర్శించారంటూ ఈ నికృష్టుడు నన్ను తిడుతూ సుదీర్ఘ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌లో నాపై చేసిన ఆరోపణలకు స్పందించాల్సిన పని లేదు. ఎందుకంటే నేనేమిటో, నా ప్రస్థానం ఎలా మొదలైందో గతంలో ఓపెన్‌గా చెప్పాను. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ జర్నలిస్టు మీడియాకు అధిపతి అవడం ఏమిటి? అని ఆశ్చర్యపోతున్నాడు మన ఏ2 విజయసాయిరెడ్డి. ఈ ప్రశ్నకు నేను గతంలోనే జవాబిచ్చాను. మా నాన్న ముఖ్యమంత్రి కాదు– జగన్‌రెడ్డివలే దొంగ ఆడిటర్ విజయసాయిరెడ్డి వంటి వారి సహకారంతో తెల్లారే సరికి మా వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పలేదు. ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ ‘ఆంధ్రజ్యోతి’ని విస్తరించాం. విజయసాయి వంటి నీచ నికృష్టుడికి ఉన్న తెలివితేటలు నాకు ఉన్నట్టయితే రోత మీడియా వలె ఒకేసారి 23 ఎడిషన్లు ప్రారంభించి ఉండేవాడిని. నేను బ్లాక్ మెయిల్ చేస్తాను, డీల్ మేకర్‌ని అని కూడా ఈ నీచుడు నన్ను నిందించాడు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించే బుద్ధి ఉంటే ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్, జగన్‌రెడ్డితో ఏకకాలంలో పోరాడాల్సిన అవసరం ఏమిటి నాకు? ఎవరినో బ్లాక్ మెయిల్ చేసే బదులు ముఖ్యమంత్రులతోనే రాజీపడిపోవచ్చు కదా! ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల అహంకార ధోరణుల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని నమ్మి పోరాడి ఆర్థికంగా ఎంతో నష్టపోయాం. అయినా చలించలేదు. నాతో సయోధ్య కుదుర్చుకోవడానికి జగన్‌రెడ్డి కూడా రాయబారాలను పంపిన విషయం విజయసాయిరెడ్డికి తెలియదా? ‘ఎంత కావాలి?’ అని అడిగితే ‘మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పాలించండి చాలు’ అని నేను చెప్పిన విషయం మరిచావా? నన్ను డీల్ మేకర్‌గా అభివర్ణించారు కదా! జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా నన్ను అనేక పర్యాయాలు కలిశావు కదా? ఏ డీల్ కోసం కలిశావో చెప్పు? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ప్రైవేట్ సంభాషణలను బహిర్గతం చేయడం అనైతికం కనుక విజయసాయిరెడ్డి నా వద్ద ప్రస్తావించిన అంశాలను ఇప్పుడు నేను వెల్లడించడం లేదు. నెల రోజుల క్రితం కూడా ఈ రాజకీయ వికృత జీవి నన్ను కలిశాడు. ఎందుకు కలిశాడో చెప్పే దమ్ముందా అతగాడికి? ‘తెలుగు రాష్ర్టాల వెలుపల ఎక్కడైనా తనతో బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం ఉందా?’ అని సవాలు కూడా విసిరాడు. విజయసాయిరెడ్డి వంటి నీచుడు కూడా చర్చకు ఆహ్వానిస్తే వెళ్లకుండా ఉంటానా? నువ్వూ నేనూ కలసి ఢిల్లీలో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమం పెట్టుకుందాం. నీ సంగతీ నా సంగతీ ఏంటో తేల్చుకుందాం. ముందుగా ట్వీట్స్ పెట్టడం, ఆ తర్వాత రహస్యంగా కలుసుకొని పైవాళ్ల ఒత్తిడితో చేశాను– నన్ను అపార్థం చేసుకోవద్దని వేడుకోవడం వెన్నెముక లేని ఈ నికృష్టుడికి అలవాటే. ముఖాముఖి చర్చకు సిద్ధం అన్నావు కనుక తాజా ట్వీట్‌లో వాగిన చెత్తకు ఇక్కడ సమాధానం చెప్పడం లేదు. మన ఇద్దరి మధ్య సాగే చర్చను ఏబీఎన్‌లో లైవ్ టెలీకాస్ట్ చేద్దాం. మీ రోత చానల్‌లో కూడా లైవ్ టెలికాస్ట్ చేసుకోవడానికి అనుమతిస్తాను. కండీషన్స్ కూడా ఏమీ లేవు. నువ్వు ఆరోపించినట్టుగా నేను వెధవ పనులు చేసి ఉన్నా, ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధి పొంది ఉన్నా జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నన్ను వదిలిపెట్టేవారా? ఎంతగా రంధ్రాన్వేషణ జరిపినా ఏమీ దొరకనందునే కదా నా మీద ఒక్క కేసూ పెట్టలేకపోయారు. ప్రభుత్వాలకు ఎదురు వెళ్లడానికి నైతిక బలం ఉండాలి. అది నాకు పుష్కలంగా ఉంది. నీకు ఆ నైతిక బలం లేనందునే కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ల కాళ్లు పట్టుకుంటావు. నీచ్ కమీన్ విజయసాయికి తెలియనిది ఏమిటంటే ‘ఆంధ్రజ్యోతి’ పత్రికను నేను ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ విషయం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియనే తెలియదు. మూతపడిన పత్రిక కార్యాలయాలను తెరిచిన తర్వాత మాత్రమే రాజశేఖరరెడ్డితోపాటు చంద్రబాబును కలసి విషయం చెప్పాను. విజయవాడ వద్ద ఏర్పాటు చేసిన మినీ హైడల్ ప్రాజెక్టు విషయం కూడా చంద్రబాబుకు తెలియదు. ముఖ్యమంత్రుల మోచేతి నీళ్లు తాగే అలవాటు లేదు కనుకనే తల ఎత్తుకొని తిరుగుతున్నాను. ఇప్పటివరకు నువ్వే నా ఇంటికి వచ్చావు కానీ నేను నీ ఇంటికి రాలేదే? ‘జగన్‌రెడ్డి నన్ను నమ్మడం లేదు, దూరం పెట్టాడు’ అని కనిపించిన వారందరి దగ్గరా ఏడ్చే నువ్వో రాజకీయ వ్యభిచారివి. రాజ్యసభలో పార్టీ ఎంపీలను చేర్పిస్తానని భారతీయ జనతా పార్టీ పెద్దలకు చెప్పి ముఖం చాటేస్తున్నదెవరు? ‘నువ్వు నమ్మదగిన వ్యక్తివి కావు– మోసగాడివి’ అని కేంద్ర హోం మంత్రి నిన్ను ఉద్దేశించి అనడం నిజం కాదా? అయినా ‘ఓపెన్ హార్ట్’ ప్రోగ్రాంకు సిద్ధంగా ఉండు. అన్ని విషయాలూ అక్కడే తేల్చుకుందాం. నిజంగా నీది మనిషి పుట్టుకే అయితే నీవు విసిరిన సవాలుకైనా సిద్ధపడు. లేని పక్షంలో ‘నీచ మానవుడిని’ అని బహిరంగంగా అంగీకరించు... నీచ నికృష్ట విజయసాయిరెడ్డీ! బెస్టాఫ్ లక్!!