AP Elections: అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం: కేశినేని చిన్ని
ABN , Publish Date - May 02 , 2024 | 12:20 PM
Andhrapradesh: కూటమి పార్టీల అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని) తెలిపారు. ఉపాధి, ఉద్యోగాలు, అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారన్నారు. ఐదేళ్లల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. గత ఐదేళ్లల్లో ఉద్యోగాలు లేక యువత భవిష్యత్తు నాశనం అయ్యిందని విమర్శించారు.
విజయవాడ, మే 2: కూటమి పార్టీల అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) (TDP MP Candidate Kasenani Sivanath) తెలిపారు. ఉపాధి, ఉద్యోగాలు, అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారన్నారు. ఐదేళ్లల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. గత ఐదేళ్లల్లో ఉద్యోగాలు లేక యువత భవిష్యత్తు నాశనం అయ్యిందని విమర్శించారు. డిగ్రీలు, పిజీలు చేసినా పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లారన్నారు. కొంతమంది గంజాయి వంటి దురలవాట్లకు బానిసగా మారుతున్నారన్నారు. టీడీపీ నేత నారా లోకేష్ ఇప్పటికే దీనిపై కార్యాచరణ సిద్ధం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసి, ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతారని హామీ ఇచ్చారు. ఎన్‌ఆర్‌ఐ వింగ్ తరపున కూడా లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారు. కూటమి పార్టీల తరపున చంద్రబాబు (TDP Chief Chandrababu) ప్రకటించిన మ్యానిఫెస్టోపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
AP News: పెన్షన్ కోసం వచ్చి కన్నీరు పెట్టుకుంటున్న వృద్ధులు.. కారణమిదే?
చంద్రబాబు క్రైసిస్ మేనేజర్..
‘‘జగన్ కోడి కత్తి డ్రామా ఆడాడు నాడు ప్రజలు నమ్మారు. ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడాడు... ప్రజలు చీదరించుకున్నారు. అన్నిసార్లు ప్రజలను మోసం చేయాలంటే సాధ్యం కాదు’’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఎన్నికల హామీలు ఇవ్వకుండా ఐదేళ్లల్లో మోసం చేస్తూనే ఉన్నారన్నారు. వైసీపీ ప్రచారం నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని తెలిపారు. చంద్రబాబు క్రైసిస్ మేనేజర్ అని... సంక్షోభ పరిస్థితిలో కూడా సంపద సృష్టించగలరన్నారు. 200 నుంచి 2000 పెన్షన్ పెంచిన చరిత్ర చంద్రబాబు ది అని చెప్పుకొచ్చారు.
AP News: బుర్రలేని సర్కార్.. డేటా చోర్!
నవరత్నాలు పేరుతో ప్రజలను మోసం చేసిన చరిత్ర జగన్ ది అని అన్నారు. మద్య నిషేధం అన్న జగన్... కల్తీ మద్యం వ్యాపారిగా మారారని తెలిపారు. నాసిరకం మద్యం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆన్‌లైన్ కాకుండా నగదు మాత్రమే తీసుకుని దోచుకున్నారని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో టీడీపీ చాలా బలంగా ఉందని... కూటమి తరపున బీజేపీ, జనసేన తోడు అయ్యాయన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక రాష్ట్ర దశ దిశ మారుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు నిరాశ
ప్రధాని రోడ్ షో ఘనంగా నిర్వహిస్తాం...
పేదలకు వైద్య సేవలు ఉచితంగా అందిస్తారన్నారు. ప్రజల సొంతింటి కలను చంద్రబాబు సాకారం చేస్తారన్నారు. విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. అన్నివిధాలా విజయవంతం చేసేలా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఏపీలో ఉన్న ప్రధాన సమస్యలను మోదీ దృష్టి కి తీసుకెళ్లి వివరిస్తామని అన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న ఇబ్బందుల పరిష్కారం కోసం నిధులు కేటాయించాలని కోరతామన్నారు. ప్రజలంతా కూటమి విజయం కోరుతున్నారన్నారు. చంద్రబాబు సీఎంగా అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ప్రజలే ధీమాగా చెబుతున్నారని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
YSRCP: సామర్లకోటలో వైసీపీకి షాక్.. టీడీపీలో పెద్ద ఎత్తున చేరికలు..
AP Politics: మిగిలింది 10 రోజులు.. తమవైపు తిప్పుకునేందుకు నేతల యత్నాలు..
Read latest AP News And Telugu News