Kishan Reddy: బీజేపీ పక్కా లోకల్.. కాంగ్రెస్సే ఇటలీ పార్టీ
ABN, Publish Date - Apr 26 , 2024 | 06:45 PM
కాంగ్రెస్ (Congress) బ్రిటిష్ వారసత్వాన్ని ఇంకా కొనసాగిస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. బ్రిటిష్ ప్రతినిధిగా ఇటలీకి చెందిన సోనియాగాంధీని దేశంపై రుద్దే ప్రయత్నం చేశారని విరుచుకుపడ్డారు. ఆమె ప్రధాని కాకుండా బీజేపీ అడ్డుకుందని గుర్తుచేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ (Congress) బ్రిటిష్ వారసత్వాన్ని ఇంకా కొనసాగిస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. బ్రిటిష్ ప్రతినిధిగా ఇటలీకి చెందిన సోనియాగాంధీని దేశంపై రుద్దే ప్రయత్నం చేశారని విరుచుకుపడ్డారు. ఆమె ప్రధాని కాకుండా బీజేపీ అడ్డుకుందని గుర్తుచేశారు. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని విమర్శించారు.
CM Revanth: రుణమాఫీ చేసి తీరుతాం... హరీష్ రాజీనామా రెడీగా పెట్టుకో.. రేవంత్ కౌంటర్
శుక్రవారం బీజేపీ కార్యాలయంలో నిజామాబాద్ మాజీ ఎంపీ రాంగోపాల్ రెడ్డి తనయుడు.. ముదుగంటి వెంకటశ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరారు. ఆ నేతలకు కిషన్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... దేశంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్ కారణమన్నారు. దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ అని విమర్శించారు. పదేళ్ల క్రితం ఇటలీ కాంగ్రెస్‌ను ప్రజలు వదిలించుకున్నారని చెప్పుకొచ్చారు. మరోసారి ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అనే దరిద్రాన్ని ప్రజలు దగ్గరకు రానివ్వరన్నారు.
మరోసారి మోదీ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్లు ఉండవని వితండవాదం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బ్రిటిష్ వారసత్వాన్ని.. బ్రిటిష్ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇటలీ కోసం పుట్టింది.. ఇప్పుడు ఇటలీ ఇబ్బందుల్లో ఉందన్నారు. ముస్లిం రిజర్వేషన్లను ఏప్రాతిపదికన తీసుకొచ్చారని ప్రశ్నించారు. జిన్నా ముస్లిం లీగ్‌లా కాంగ్రెస్ రూపాంతరం చెందిందని ఆక్షేపించారు. జమ్మూలోనే 42వేల మంది ప్రాణాలు బలి చేసిందని అన్నారు. జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి ఆర్టికల్ 370 అమలుచేశామని గుర్తుచేశారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసిందని దుయ్యబట్టారు.
Congress: హరీష్‌రావు రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేదు: మంత్రి కోమటిరెడ్డి
కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే విస్మయం కలిగిస్తోందన్నారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లకు గండి కొడుతున్నది ఎవరో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. ముస్లింలను తీసుకొచ్చి బీసీలుగా మారుస్తున్నారని... దీనివల్ల బీసీలకు అన్యాయం జరిగుతోందని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు తొలగిస్తామని తమపై మతి భ్రమించి మాట్లాడుతున్నారా అని నిలదీశారు. హైదరాబాద్‌లో బీసీలు లేరా? వారు కార్పొరేటర్లు కావద్దా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, ఎంఐఎం బీసీ సీట్లను ముస్లింలకు కేటాయించిందన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేశాక రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపై మాట్లాడాలన్నారు.
Balmoor Venkat: అలాంటి వ్యక్తి వచ్చాడనే గన్‌పార్క్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేశా..
సిగ్గులేకుండా ఓట్ల కోసం దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ పక్కా లోకల్ పార్టీ.. కాంగ్రెస్ పక్కా ఇటలీ పార్టీ అని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ కనుచూపు మేరలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. అంబేద్కర్ బతికి ఉన్న సమయంలో, మరణం తర్వాత కూడా కాంగ్రెస్ అవమానించిందని మండిపడ్డారు. తాము ఈబీసీ రిజర్వేషన్లు తెచ్చాం.. అలాంటిది తాము తొలగిస్తామా? అని నిలదీశారు. తమది రిజర్వేషన్లు ఇచ్చే పార్టీ.. తొలగించే పార్టీ కాదని స్పష్టంచేశారు.
ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ రద్దు చేస్తామని తేల్చిచెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వయస్సు అయిపోయిందని.. టీషర్టు వేసుకున్న మాత్రాన యువకుడు కాదని విమర్శించారు. పదేళ్లలో తెలంగాణను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్.. ఫాంహౌజ్‌లో ఉండిపోవాలని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి.. ఒట్లు పెట్టుకుంటే ఓట్లు పడవన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తన కుర్చీ ఎక్కడ పోతుందోనని భయపడి రేవంత్ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kothakota Srinivas: ప్రభాకర్‌కు రెడ్ కార్నర్ నోటీసులపై హైదరాబాద్ సీపీ షాకింగ్ కామెంట్స్
Read Latest Election News or Telugu News
Updated Date - Apr 26 , 2024 | 06:51 PM