Sleepmaxxing: స్లీప్‌మ్యాక్సింగ్ గురించి తెలుసా.. ఇలా చేస్తే రాత్రిళ్లు పర్‌ఫెక్ట్ నిద్ర! | Heard Of Sleepmaxxing This Trend Is Fuelling Perfect Sleep pcs spl
Share News

Sleepmaxxing: స్లీప్‌మ్యాక్సింగ్ గురించి తెలుసా.. ఇలా చేస్తే రాత్రిళ్లు పర్‌ఫెక్ట్ నిద్ర!

ABN , Publish Date - Sep 22 , 2024 | 08:37 PM

నిద్రకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్న నేటి తరం రాత్రంతా కంటినిండా నిద్రపోయేందుకు ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలోనే స్లీప్‌మ్యా్క్సింగ్ అనే ట్రెండ్ ఉనికిలోకి వచ్చింది. ఇందులో భాగంగా వివిధ రకాల పరికరాలు, ధ్యానం, పుస్తకపఠం వంటి అలవాట్లతో జనాలు మంచి నిద్రకోసం ప్రయత్నిస్తున్నారు.

Sleepmaxxing: స్లీప్‌మ్యాక్సింగ్ గురించి తెలుసా..  ఇలా చేస్తే రాత్రిళ్లు పర్‌ఫెక్ట్ నిద్ర!

ఇంటర్నెట్ డెస్క్: రాత్రిళ్లు పరిపూర్ణంగా నిద్రించడం నేటి జమానాలో అత్యవసరంగా మారింది. టార్గెట్స్, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేసే అనేక మంది రాత్రిళ్లు నిద్రలోనే పూర్తిస్థాయిలో రిఫ్రెష్ అవుతారు. అయితే, ఆధునిక జీవన శైలి కారణంగా అనేక మందికి రాత్రిళ్లు కలత నిద్ర సాధారణమైపోయింది. గాఢ నిద్ర లేక మరుసటి రోజంతా నిరసంగా గడుపుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రస్తుతం స్లీప్ మ్యాక్సింగ్ అనే ట్రెండ్ మొదలైంది. ముఖ్యంగా గాఢ నిద్రపోయేందుకు ఏమేం చేయాలో నిపుణులతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు పంచుకుంటున్నారు (Health).

Viral: కుర్చిలో కూర్చునే పొట్టచుట్టూ కొవ్వు కరిగించుకోవచ్చు! ఎలాగంటే..

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఏమిటీ స్లీప్ మ్యాక్సింగ్..

సింపుల్‌గా చెప్పాలంటే రాత్రిళ్లు నిద్రలో నాణ్యత పెంచడమే స్లీప్ మ్యాక్సింగ్. గాఢ నిద్ర కోసం రకరకాల టెక్నిక్స్, పరికరాలు వాడతారు. ఉదాహరణకు నిద్ర చెడగొట్టే గురకకు అడ్డుకట్ట వేసేందుకు మౌత్ టేప్, మెగ్నీషియమ్ ఆయిల్, ఇతర సప్లిమెంట్స్ వినియోగం, స్లీప్ ట్రాకర్స్, జా ట్రాప్స్, రెడ్ లైట్ థెరపీ, టార్ట్ చెర్రీ జ్యూస్, మెలటోనిన్ సప్లిమెంట్స్, అశ్వగంధ వినియోగం వంటి టెక్నిక్స్‌తో నిద్ర క్వాలిటీ పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తొలుత అమెరికాలో మొదలైన ట్రెండ్ ప్రస్తుతం మిగతా దేశాలకూ వ్యాపించింది.

ఇక నిద్ర నాణ్యత పెంచే పరికరాల మార్కెట్ రానున్న రోజుల్లో భారీగా పెరుగుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఈ ఏడాది భారత్‌‌లో స్లీప్‌మ్యాక్సింగ్ పరికరాలు మార్కెట్ 28 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

Viral: ఉదయాన్నే నీరు తాగితే హ్యాంగోవర్ తొలగిపోతుందా? ఇందులో నిజమెంత?


ఇక నిద్రలేమికి పలు కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. హృద్రోగాలు, కిడ్నీ సమస్యలు, హైబీపీ, షుగర్ వ్యాధి, స్ట్రోక్, ఒబెసిటీ, డిప్రెషన్ వంటి వాటి కారణంగా నిద్రకు దూరమవుతారు. అయితే, గాఢ నిద్రపోవాలని అతిగా ఆరాటపడితే మొదటికే మోసం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నరు. నిద్రపట్టదేమో అన్న ఆందోళన ఒత్తిడితో నిజంగానే నిద్ర కరువయ్యే పరిస్థితి వస్తుందని అన్నారు. కాబట్టి, మంచి నిద్రకోసం రాత్రిళ్లు ఓ పుస్తకం చదవడం లేదా ధ్యానం చేయడం వంటివి చేస్తే మనసు కుదుటపడి కంటినిండా కునుకుపడుతుందని చెబుతున్నారు.

Insulin: ఇన్సులీన్ తీసుకునే పేషెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

Read Health and Latest News

Updated Date - Sep 22 , 2024 | 08:48 PM

News Hub