Share News

ట్రంప్‌పై హత్యాయత్నం వెనుక ఉక్రెయిన్‌?

ABN , Publish Date - Jul 17 , 2024 | 05:27 AM

అమెరికా మాజీ అధ్యక్షుడు, 2024 ప్రెసిడెన్షియల్‌ రేసులో దూసుకుపోతున్న డోనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం వెనుక ఉక్రెయిన్‌ ఆర్మీ హస్తం ఉందా? ప్రముఖ సెక్యూరిటీ అనలిస్టు మార్క్‌ సెల్బోడా..

ట్రంప్‌పై హత్యాయత్నం వెనుక ఉక్రెయిన్‌?

ఘటన అనంతరం సోషల్‌ మీడియాలో

ఆ దేశ వైమానిక దళ హర్షాతిరేకం

సెక్యూరిటీ అనలిస్ట్‌ మార్క్‌ సెల్బోడా వెల్లడి

తాను గెలిస్తే ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని

నిలిపేస్తానని ట్రంప్‌ ప్రకటించడం వల్లే..?

మాస్కో, జూలై 16: అమెరికా మాజీ అధ్యక్షుడు, 2024 ప్రెసిడెన్షియల్‌ రేసులో దూసుకుపోతున్న డోనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం వెనుక ఉక్రెయిన్‌ ఆర్మీ హస్తం ఉందా? ప్రముఖ సెక్యూరిటీ అనలిస్టు మార్క్‌ సెల్బోడా.. ఉక్రెయిన్‌ ఆర్మీ హస్తం ఉందనే అభిప్రాయపడుతున్నారు. రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వార్తాసంస్థ నిర్వహించిన ‘ద క్రిటికల్‌ అవర్‌ ప్రోగ్రామ్‌’లో ఆయన మాట్లాడారు. ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిందన్న విషయం తెలియగానే ఉక్రెయిన్‌కు చెందిన 79వ ఎయిర్‌ అసాల్ట్‌ బ్రిగేడ్‌ సోషల్‌ మీడియా వేదికగా సంతోషం తెలిపిందని.. ఇది తమ సొంత ఇంటెలిజెన్స్‌ వ్యవస్థల పనేనని వారు భావిస్తున్నారని ఆయన వివరించారు. ట్రంప్‌పై కాల్పుల వెనుక ఉక్రెయిన్‌ హస్తం ఉందనడానికి ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ లేవు. అయినప్పటికీ.. తాను గెలిస్తే ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని నిలిపివేస్తానని ట్రంప్‌ ప్రకటించినందునే ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌, బైడెన్లలో ఎవరు గెలిచినా వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని జెలెన్‌స్కీ తెలిపారు.

Updated Date - Jul 17 , 2024 | 05:27 AM