Share News

Chandigarh: ఇండియా కూటమికి దెబ్బ... ఈ రెండు కీలక పోస్టులు బీజేపీ కైవసం

ABN , Publish Date - Mar 04 , 2024 | 03:28 PM

లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి గట్టి దెబ్బ తగిలింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ రెండు పోస్టుల్లోనూ బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.

Chandigarh: ఇండియా కూటమికి దెబ్బ... ఈ రెండు కీలక పోస్టులు బీజేపీ కైవసం

చండీగఢ్: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ (Chandigarh civic body) ఎన్నికల్లో 'ఇండియా' (I.N.D.I.A.) కూటమికి గట్టి దెబ్బ తగిలింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ రెండు పోస్టుల్లోనూ బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. సీనియర్ డిప్యూటీ మేయర్‌గా ఆ పార్టీకి చెందిన అభ్యర్థి కుల్జీత్ సింగ్ సంధు (Kuljeet sing Sandhu). డిప్యూటీ మేయర్‌గా రాజేంద్ర శర్మ (Rajendra Sharma) గెలిచారు.


కుల్జీత్ సింగ్ సంధుకు మొత్తం 19 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి గురుప్రీత్ సింగ్ గబీకి 16 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లలేదు. రాజేంద్ర శర్మ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా దేవిని ఓడించారు. మొత్తం 36 ఓట్లలో శర్మకు 19 ఓట్లు రాగా, దేవికి 17 ఓట్లు వచ్చాయి. జనవరి 30న చండీగఢ్ మేయర్ ఎన్నికలు జరుగగా అప్పుడు నెలకొన్న గందరగోళం ఈ అశం సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికలు నిర్వహించిన తీరుపై ప్రిసైడింగ్ అధికారిని సుప్రీంకోర్టు మందలిస్తూ ఆప్, కాంగ్రెస్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే డిప్యూటీ మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు తాజాగా నిర్వహించారు. కాంగ్రెస్, ఆప్‌ కూటమికి 20 మంది కౌన్సిలర్లు ఉండగా, ఇటీవల ముగ్గురు బీజేపీలో చేరారు. ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఓటింగ్ హక్కు ఉన్న చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన ఒక కౌన్సిలర్ బీజేపీకి అనూకూలంగా ఓటు వేయడంతో బీజేపీకి 19 సీట్లు వచ్చాయి.

Updated Date - Mar 04 , 2024 | 03:57 PM