Share News

Chennai: అన్నామలైకి కేంద్రమంత్రి పదవి? అదేగాని జరిగితే ఇక రాష్ట్రంలో అధికారపార్టీకి...

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:18 PM

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్‌ పెంచిన ఉత్సాహంతో ఢిల్లీ వెళ్ళిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకులతో ఆయన మంతనాలు జరుపుతున్నారు.

Chennai: అన్నామలైకి కేంద్రమంత్రి పదవి? అదేగాని జరిగితే ఇక రాష్ట్రంలో అధికారపార్టీకి...

చెన్నై: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్‌ పెంచిన ఉత్సాహంతో ఢిల్లీ వెళ్ళిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(State President Annamalai) కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకులతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసినా ఓటు బ్యాంక్‌ పెరిగి పార్టీ ప్రతిష్ఠ ఉన్నతస్థితికి చేరిందని అన్నామలై చెబుతున్నారు. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినవారికి మంత్రి పదవులు, గవర్నర్‌ పదవులు ఇచ్చినట్లే ఈసారి పార్టీ అధిష్టానం తనకు తప్పకుండా మంత్రి పదవి కట్టబెడుతుందని ఆశపడుతున్నారు. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన ఇలా గణేషన్‌, సీపీ రాధాకృష్ణన్‌, తమిళిసైలను గవర్నర్లుగా నియమించిందని, తనకు ముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్‌.మురుగన్‌కు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించారని, ఆ వరుసలోనే తనకు కూడా కేంద్ర మంత్రిపదవి తప్పకుండా లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదిరూడా చదవండి: Rajinikanth: మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్‌కు ఆహ్వానం


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను పార్టీ పగ్గాలు స్వీకరించినప్పటి నుండే పార్టీ ప్రతిష్ట క్రమంగా పెరుగుతూ వచ్చిందని, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటు బ్యాంక్‌ 11.5 శాతానికి పెరిగిందని ఆయన చెబుతున్నారు. అన్నామలై ఇమేజ్‌ వల్ల పార్టీకి ఓటు బ్యాంక్‌ పెరుగలేదని, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల వ్యక్తిగత కీర్తిని చూసే ఓటర్లు ఓటువేశారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ తనకు కేంద్ర మంత్రి వర్గంలో తప్పకుండా స్థానం లభిస్తుందని అన్నామలై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల వివరాలన్నీ మోదీ వద్ద ఉన్నాయని, వాటిని పరిశీలించినమీదటే ఎవరికి ఏ మంత్రిత్వ శాఖను కేటాయించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటారని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ అన్నామలై ఢిల్లీ తిష్టవేసి మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో ఒకటి రెండు రోజుల తర్వాతే తెలుస్తుంది.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 08 , 2024 | 12:37 PM