Share News

Chennai: అమ్మవారి విగ్రహం నేత్రాల నుంచి కాంతి..

ABN , Publish Date - Aug 08 , 2024 | 01:23 PM

అమ్మవారి విగ్రహంలో నేత్రాల నుంచి కాంతి వస్తుందనే వార్త దావానంలా వ్యాపించడంతో భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. తిరునల్వేలి జిల్లా దివైయన్‌విలై(Thirunalveli District Divayanvilai) మెయిన్‌ బజార్‌లో అర్బుత వినాయకర్‌ ఆలయం ఉంది.

Chennai: అమ్మవారి విగ్రహం నేత్రాల నుంచి కాంతి..

- పరవశించిన భక్తులు

చెన్నై: అమ్మవారి విగ్రహంలో నేత్రాల నుంచి కాంతి వస్తుందనే వార్త దావానంలా వ్యాపించడంతో భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. తిరునల్వేలి జిల్లా దివైయన్‌విలై(Thirunalveli District Divayanvilai) మెయిన్‌ బజార్‌లో అర్బుత వినాయకర్‌ ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో నే ప్రత్యేకంగా అన్నై మూకాంబికై ఆలయం ఉంది. మంగళవారం సాయంత్రం 6.40 గంటలకు ఆలయ పూజారి ముఖేష్‌ భట్టాచార్యులు మూకాంబికై అమ్మవారికి అలంకరణ చేసేందుకు సామగ్రి సిద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో ఆ ప్రాంతానికి చెందిన ముత్తు ఆచారి తన భార్యతో అక్కడకు చేరుకొని, తన భార్య ప్రసవం మంచిగా జరగాలని వేడుకున్నారు.

ఇదికూడా చదవండి: High Court: ఇద్దరు మంత్రులకు హైకోర్టు షాక్‌.. విషయం ఏంటంటే..


ఆ సమయంలో అమ్మవారి విగ్రహంలోని నేత్రాల నుంచి ఒక విధమైన కాంతి రావడం ముత్తు భార్య గమనించింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో ఆయన ఆ అద్భుత దృశ్యాన్ని చూసి పూజారికి తెలిపాడు. ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారి నేత్రాల నుంచి కాంతిని గమనించి పులికించిపోయారు. అనంతరం రాత్రి 10 గంటలకు ఆలయాన్ని యధావిధిగా మూసివేశారు. బుధవారం ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరువగా, అప్పటికే అక్కడ భక్తులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. కానీ, విగ్రహంలో అమ్మవారి నేత్రాలు సాధారణంగానే ఉండడంతో నిరాశతో వెనుదిరిగారు.


....................................................................

ఈ వార్తను కూడా చదవండి..

.......................................................................

Chennai: ఊటీ కొండ రైలు సేవలు ప్రారంభం..

చెన్నై: మరమ్మతులు పూర్తకావడంతో బుధవారం ఉదయం 7.10 గంటలకు మేట్టుపాళయం నుంచి ఊటీ(Ooty)కి కొండ రైలు పర్యాటకులతో బయల్దేరి వెళ్లింది. కోయంబత్తూర్‌ జిల్లా మేట్టుపాళయం రైల్వేస్టేషన్‌(Mettupalayam Railway Station) నుంచి నీలగిరి జిల్లా ఊటీకి ప్రతిరోజు ఉదయం 7.10 గంటలకు కొండ రైలు బయల్దేరుతుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పర్వత రైలులో ప్రయాణిస్తూ నీలగిరి ప్రకృతి అందాలు వీక్షించేందుకు దేశ, విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు.

nani3.2.jpg


ఈ నేపథ్యంలో, ఈ నెల 1వ తేది భారీవర్షాల కారణంగా హిల్‌గ్రోవ్‌-అటర్లీ స్టేషన్ల మధ్య రైలు మార్గంపై మట్టిచెరియలు, చెట్లు విరగిపడ్డాయి. దీంతో, 6వ తేది వరకు కొండ రైలు సేవలు రద్దు చేస్తున్న దక్షిణ రైల్వే ప్రకటించింది. ఈ నేపథ్యంలో, రైలు మార్గంపై పడిన మట్టిచెరియలు, చెట్లు పూర్తిగా తొలగించిన నేపథ్యంలో, బుధవారం నుంచి కొండ రైలు సేవలు యధావిధిగా ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 08 , 2024 | 01:23 PM