Share News

Jammu Kashmir: ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇచ్చిన ఫరూక్ అబ్దుల్లా

ABN , Publish Date - Aug 16 , 2024 | 03:24 PM

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ఈసీఐ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పష్టత ఇచ్చారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Jammu Kashmir: ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇచ్చిన ఫరూక్ అబ్దుల్లా

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ఈసీఐ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా (Farroq Abdullah) స్పష్టత ఇచ్చారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


ఎన్నికలు జరపాలని తాను పదేపదే కోరుతూ వస్తున్నానని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి చాలా కాలమైందని ఫరూక్ అబ్దుల్లా ఉన్నారు. ప్రజా ప్రతినిధులు ఉంటేనే సమస్యలు పరిష్కరమవుతాయని చెప్పారు. ప్రస్తుతానికి అయితే, నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటోందని ఆయన తెలిపారు. ఇతర పార్టీలు పొత్తులతో ఎన్నికకు వెళ్తాయా, లేదా అనేది తనకు తెలియదని చెప్పారు.

Uddhav Thackeray: మాది వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్.. ఉద్ధవ్ థాకరే


ఒమర్ పోటీ చేయరు..

అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, అయితే తన కుమారుడు ఒమర్ అబ్దుల్లా మాత్రం జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంత వరకూ పోటీ చేయనని చెబుతున్నారని ఫరూక్ తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్రప్రతిపత్తి వచ్చిన వెంటనే ఒమర్ పోటీ చేస్తారని చెప్పారు. ఒమర్‌కు తన సీటు ఖాళీ చేసి ఇస్తానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 16 , 2024 | 03:25 PM