Share News

సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేడు బాధ్యతలు

ABN , Publish Date - Nov 11 , 2024 | 05:11 AM

సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేడు బాధ్యతలు

  • ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం

  • 51వ సీజేఐగా జస్టిస్‌ ఖన్నా నేడు బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ, నవంబరు 10: సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 1960 మే 14న జన్మించిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్‌ లా సెంటర్‌లో న్యాయవాద విద్యను అభ్యసించారు. 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆయన ఆర్టికల్‌ 370 రద్దుకు సమర్థన, ఎన్నికల బాండ్ల పథకం రద్దు, ఈవీఎంలపై పిటిషన్‌ కొట్టివేత , ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు సహా అనేక చారిత్రక తీర్పులిచ్చిన ధర్మాసనాలలో భాగంగా ఉన్నారు. ఇప్పటి వరకు సీజేఐగా ఉన్న జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆదివారం పదవీ విరమణ చేయడంతో సుప్రీంకోర్టులో అంత్యత సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఖన్నా ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.

Updated Date - Nov 11 , 2024 | 05:11 AM