Share News

Sharad Pawar: బ్యాలెట్‌ కోసం పట్టుబట్టిన మర్కద్వాడి గ్రామంలో పవార్.. బీజేపీ మండిపాటు

ABN , Publish Date - Dec 08 , 2024 | 02:58 PM

అమెరికా, ఇగ్లాండ్, పలు యూరోపియన్ దేశాల్లో ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్నప్పుడు, యావత్ ప్రపంచం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతున్నప్పుడు మనం ఎందుకు ఆ విధంగా చేయకూడదని శరద్ పవార్ ప్రశ్నించారు.

Sharad Pawar: బ్యాలెట్‌ కోసం పట్టుబట్టిన మర్కద్వాడి గ్రామంలో పవార్.. బీజేపీ మండిపాటు

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రజలు ఆనందంగా లేరంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్‌సీపీ (ఎస్‌పీ) నేత శరద్ పవార్ (Sharad Pawar) షోలాపూర్ జిల్లా మర్కద్వాడి (Markadwadi) గ్రామంలో ఆదివారం పర్యటించారు. అక్కడ జరిగిన ఈవీఎం వ్యతిరేక నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మల్షిరాస్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ చిన్న గ్రామం మర్కద్వాడి. ఇటీవల వెలువడిన ఫలితాలపై ఆ గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశారు. బ్యాలెట్ ద్వారా మాక్ రీ-పోల్‌కు ప్లాన్ చేయడంతో పోలీసులు వారిని అడ్డుకుని పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ ఆ గ్రామంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Farmers Protest: ఢిల్లీ వైపు కొనసాగుతున్న రైతుల నిరసన.. మళ్లీ అడ్డుకుంటున్న పోలీసులు


''ఇక్కడకు వచ్చేముందు నాకు ఒక సమాచారం తెలిసింది. ఎన్నికల ఫలితాలను విశ్వసించకపోవడంతో బ్యాలెట్ ద్వారా ఎన్నికల నిర్వహించాలని ఇక్కడి ప్రజలు కోరుకోవడంపై పలువురిపై కేసులు పెట్టినట్టు తెలిసింది. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మీ ఫిర్యాదులు ఏమిటో నాకు ఇవ్వండి. దానిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తాం. ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఒక తీర్మానం తీసుకువస్తాం'' అని మర్కద్వాడి గ్రామస్థులను ఉద్దేశించి పవార్ తెలిపారు. అమెరికా, ఇగ్లాండ్, పలు యూరోపియన్ దేశాల్లో ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్నప్పుడు, యావత్ ప్రపంచం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతున్నప్పుడు మనం ఎందుకు ఆ విధంగా చేయకూడదని పవార్ ప్రశ్నించారు.


మండిపడిన బీజేపీ

కాగా, పవార్‌ అబద్ధాలు ప్రచారం చేస్తూ మహారాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారంటూ బీజేపీ మండిపడింది. మర్కద్వాడిలో జరిగిన కార్యక్రమంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే మాట్లాడుతూ, ఓటమిని శరద్ పవార్ అంగీకరించాలని, ఈ ఎన్నికల్లో ఆయనకు గట్టి దెబ్బతగిలిందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే తరహా అబద్ధాలు చెప్పినప్పటికీ ప్రజలు తిప్పికొట్టారని, ఇప్పడు ఆయన మర్కద్వాడి వెళ్లారని అన్నారు. ఆయన వయస్సుకు అబద్ధాలు ఆడటం తగదని హితవు పలికారు. ''పవార్‌ను మహారాష్ట్ర గౌరవిస్తుంది. మర్కద్వాడిలో చాలా ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో పలు ఎన్నికలు ఈవీఎంలపై జరిగాయి. కానీ వాళ్లెప్పుడూ ఈవీఎంలను వ్యతిరేకించ లేదు. 31 మంది ఎంపీలు ఎన్నికైనప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ఉనికి కాపాడేందుకు పవార్ ప్రయాస పడుతున్నారు. ఆ ఎన్నికల్లోనూ మహా వికాస్ అఘాడి ఓడిపోతుందని ఆయనకు తెలుసు. వాళ్లకు డిపాజిట్లు కూడా రావు'' అని బవాంకులే వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

Viral News: పుష్ప సినిమా స్టైల్లో బంగాళాదుంపల స్మగ్లింగ్.. అడ్డుకున్న పోలీసులు

Viral: కదులుతున్న కారు టాపుపై కూర్చుని పోలిసు అధికారి కుమారుడి పోజులు!

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 08 , 2024 | 02:58 PM