Share News

Viral News: దారుణం.. అంగన్వాడీ కార్యకర్త ముక్కు కోసిన దుర్మార్గుడు.. ఎందుకంటే?

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:55 PM

క్షణికావేశంలో కొందరు చేసే పనులు మితిమీరిపోతుంటాయి. అలాంటి ఘటనే కర్ణాటకలో తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెలగావికి చెందిన అంగన్వాడీ కార్యకర్త సుగంధ మోరే తన పిల్లలతో కలిసి నివసిస్తోంది.

Viral News: దారుణం.. అంగన్వాడీ కార్యకర్త ముక్కు కోసిన దుర్మార్గుడు.. ఎందుకంటే?

బెంగళూరు: క్షణికావేశంలో కొందరు చేసే పనులు మితిమీరిపోతుంటాయి. అలాంటి ఘటనే కర్ణాటకలో తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెలగావికి చెందిన అంగన్వాడీ కార్యకర్త సుగంధ మోరే తన పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఆమె పిల్లలు పక్కనే ఉన్న కల్యాణి మోరే అనే వ్యక్తి ఇంట్లో పూలు కోశారు. దీంతో కోపోద్రిక్తుడైన కల్యాణి మోరే సుగంధతో గొడవకు దిగాడు. ఇరువురి మధ్య మాటామాట పెరిగి భౌతిక దాడులకు దిగేలా చేసింది.

ఈ క్రమంలో కల్యాణి మోరే ఇంట్లోనుంచి కత్తి తీసుకొచ్చి సుగంధ ముక్కు కోసేశాడు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. తీవ్ర రక్తస్రావమైన సుగంధను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - Jan 03 , 2024 | 01:56 PM