Share News

Metro trains: మార్చిలోగా డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్లు.. ఇవి తయారయ్యేది మన ఏపీలోనే

ABN , Publish Date - Nov 07 , 2024 | 12:36 PM

నగరంలో రెండో దశ మెట్రోరైలు మార్గాల్లో డ్రైవర్‌ రహిత మెట్రోరైళ్లు(Driverless metro trains) పరుగులు తీయనున్నాయి. రూ.63,246 కోట్లతో మాధవరం - సిప్కాట్‌, లైట్‌హౌస్‌ - పూందమల్లి(Lighthouse - Poondamalli), మాధవరం - చోళింగనల్లూరు తదితర మూడు మార్గాల్లో 118.9 కి.మీ. వరకు రైలు మార్గాల నిర్మాణం, రైల్వేస్టేషన్ల పనులు చురుకుగా సాగుతున్న విషయం తెలిసిందే.

Metro trains: మార్చిలోగా డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్లు.. ఇవి తయారయ్యేది మన ఏపీలోనే

చెన్నై: నగరంలో రెండో దశ మెట్రోరైలు మార్గాల్లో డ్రైవర్‌ రహిత మెట్రోరైళ్లు(Driverless metro trains) పరుగులు తీయనున్నాయి. రూ.63,246 కోట్లతో మాధవరం - సిప్కాట్‌, లైట్‌హౌస్‌ - పూందమల్లి(Lighthouse - Poondamalli), మాధవరం - చోళింగనల్లూరు తదితర మూడు మార్గాల్లో 118.9 కి.మీ. వరకు రైలు మార్గాల నిర్మాణం, రైల్వేస్టేషన్ల పనులు చురుకుగా సాగుతున్న విషయం తెలిసిందే. 2026లోగా ఈ మూడు మార్గాల్లో మెట్రోరైళ్లను నడిపేందుకు మెట్రోరైల్‌ అధికారులు నిర్ణయించారు.

ఈ వార్తను కూడా చదవండి: దేశంలో కుల గణన జరిగి తీరుతుంది: రాహుల్‌


ముందుగా ఏ మార్గంలో పనులు పూర్తవుతాయో ఆ మార్గంలో మెట్రోరైలు సేవలు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండోవిడత మెట్రోరైలు మార్గాల్లో ప్రయోగాత్మకంగా డ్రైవర్‌ రహిత రైళ్లను నడిపేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఆ మేరకు మొదటి డ్రైవర్‌ రహిత మెట్రోరైలును అక్టోబర్‌లో పూందమల్లిలో ఉన్న మెట్రోరైలు డిపో నిర్వాహకులకు అప్పగించారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని శ్రీసిటీలో తయారవుతోంది. మరో తొమ్మిది డ్రైవర్‌ రహిత రైళ్లు వచ్చే యేడాది మార్చిలోగా నగరానికి చేరుకోనున్నాయి.


nani1.jpg

ప్రస్తుతం డ్రైవర్లతో కూడిన నాలుగు బోగీల రైళ్లు నడుపుతున్నారు. రెండో దశ మెట్రోరైలు ప్రాజెక్టులో డ్రైవర్‌ లేకుండా మూడు బోగీలు కలిగిన రైళ్లను నడుపబోతున్నారు. ప్రయాణికుల అవసరాలను బట్టి ఈ డ్రైవర్‌ రహిత రైళ్ల బోగీల సంఖ్యలను ఆరుదాకా పెంచే యోచనలు కూడా ఉన్నాయని మెట్రోరైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ డ్రైవర్‌ రహిత మెట్రోరైలు ట్రయల్‌ రన్‌ గత వారం రోజులకు పైగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరులను ఈ రైళ్ల పనితీరును మెట్రోరైల్వే భద్రతావిభాగం ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు.


ఈవార్తను కూడా చదవండి: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్‌!

ఈవార్తను కూడా చదవండి: కేశవాపురం వద్దు.. మేఘా కాంట్రాక్టు రద్దు

ఈవార్తను కూడా చదవండి: అరుణాచల ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఈవార్తను కూడా చదవండి: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 07 , 2024 | 12:36 PM