Nana Patole: కాంగ్రెస్ చీఫ్ పాదాలు కడిగిన కార్యకర్త.. మండిపడిన బీజేపీ
ABN , Publish Date - Jun 18 , 2024 | 04:56 PM
మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ కార్యకర్తగా భావిస్తున్న ఓ వ్యక్తి పటోలే పాదాలను కడుగుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తాజాగా వెలుగు చూడటంతో వివాదం మొదలైంది. పటోలే కారులో కూర్చుని ఉండగా, పార్టీ కార్యకర్త ఒకరు ఆయన పాదాలను శుభ్రం చేస్తున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది.
ముంబై: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే (Nana Patole) వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ కార్యకర్తగా భావిస్తున్న ఓ వ్యక్తి పటోలే పాదాలను కడుగుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తాజాగా వెలుగు చూడటంతో వివాదం మొదలైంది. పటోలే కారులో కూర్చుని ఉండగా, పార్టీ కార్యకర్త ఒకరు ఆయన పాదాలను శుభ్రం చేస్తున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది.
అకోలా జిల్లాలో నానాపటోలే పర్యటిస్తుండగా వర్షం పడి రోడ్డంతా బురదగా మారింది. దాంతో ఆయన కాళ్లకు బురద అంటింది. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే దీనిపై నానాపటేలే తక్షణ వివరణ ఇచ్చారు. సోమవారం జరిగిన ఈ ఘటన విషయంలో దాచిపెట్టేందుకు ఏమీ లేదని చెప్పారు. కాళ్లు బురదగా ఉండటంతో నీళ్లు తెచ్చిపెట్టమని మాత్రమే తాను కోరానని చెప్పారు. ''నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. కాళ్లకు బురద అంటుకోవడంతో నీళ్లు తెచ్చిపెట్టమని ఒక కార్యకర్తను కోరారు. ఆయన నా పాదలపై నీళ్లు పోశారు. నేనే స్వయంగా నా పాదాలను కడుకున్నాను'' అని పటేలో మంగళవారంనాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.
NEET row: 0.001 నిర్లక్ష్యం ఉన్నా వెంటనే పరిష్కరించాలి.. ఎన్‌టీఏపై మండిపడిన 'సుప్రీం'
కాంగ్రెస్ ఫ్యూడల్ మనస్తత్వానికి ఇదే నిదర్శనం: బీజేపీ
నానా పటోలే కాళ్లను కార్యకర్త ఒకరు కడుగుతున్న వీడియో వెలుగుచూడగానే బీజేపీ నేత షెహజాద్ పూనావాలా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీది నవాబీ, ఫ్యూడల్ మనస్తత్వమని అన్నారు. పార్టీ కార్యకర్తతో నానాపటోలే కాళ్లు కడిగించుకుంటున్నారని, ఓటర్లను, కార్యకర్తలను వాళ్లు బానిసల్లా చూస్తారని ఆరోపించారు. తమను తాము రాజులు, రాణుల్లా భావించుకుంటారని అన్నారు. కార్యకర్తతో పాదాలు కడిగించుకున్నందుకు నానా పటోలే, కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..