Sonia Gandhi: సోనియా గాంధీ నివాసం వద్ద సిక్కు సంఘాలు ఆందోళన
ABN , Publish Date - Sep 11 , 2024 | 06:19 PM
మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివిధ సభల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో ప్రస్తుతం చోటు చేసుకున్న వివిధ పరిణామాలపై ఆయన ప్రసంగిస్తున్నారు. దేశంలో మత స్వేచ్ఛపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివిధ సభల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో ప్రస్తుతం చోటు చేసుకున్న వివిధ పరిణామాలపై ఆయన ప్రసంగిస్తున్నారు. దేశంలో మత స్వేచ్ఛపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కొన్ని సిక్కు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో గురువారం న్యూఢిల్లీలోని సోనియా గాంధీ నివాసం వద్ద సిక్కు సంఘాలు ఆందోళన చేపట్టాయి. తన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని ఆ యా సంఘాలు డిమాండ్ చేశాయి.
Himachal Pradesh: జూనియర్‌ని ర్యాగింగ్ చేసిన సీనియర్లు అరెస్ట్
యూఎస్‌లోని జార్జి టౌన్ యూనివర్సిటీలో విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్‌లో తలపాగాలు, కడియాలు ధరించేందుకు అనుమతి ఉందా? అని సందేహం వ్యక్తం చేశారు. గురు ద్వారాలను సందర్శించేందుకు అనుమతిస్తారా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ఇదే పోరాటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Kolkata: సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై పలు సిక్కు సంఘాలు మండిపడ్డాయి. అందులోభాగంగా బీజేపీకి అనుబంధంగా ఉన్న పలు సిక్కు సంఘాలు బుధవారం జన్‌పథ్ రోడ్డులోని సోనియా గాంధీ నివాసం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టాయి. ఆమె నివాసం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ఆందోళన కారులు ఈ సందర్భంగా ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ యూఎస్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా టెక్సాస్, జార్జ్‌టౌన్ తదితర ప్రాంతాల్లో సభల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో ప్రస్తుత పరిణామలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారని తెలిపారు. బడా వ్యాపారులతో నరేంద్ర మోదీ కుమ్మక్కయ్యారని విమర్శించారు.
ఎన్నికల వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందన్నారు. భారత్‌లో హక్కుల కోసం సంఘర్షణ కొనసాగుతుందని తెలిపారు. సిక్కులు తలపాగా ధరించే హక్కు సైతం లేదన్నారు. అమెరికా వేదికగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడ్డింది. విదేశాల్లో భారత్ పరువు మంటకలుపుతున్నారంటూ రాహుల్ గాంధీపై ఆ పార్టీ అగ్రనేతలు నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.
Read More National News and Latest Telugu New