Share News

Ratan Tata: ఇంతకీ రతన్ టాటా వారసుడెవరూ?

ABN , Publish Date - Oct 10 , 2024 | 09:01 PM

రతన్ టాటా సవతి సోదరుడు నోయోల్ టాటా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనకు ఈ టాటా గ్రూప్‌లో పని చేసిన అనుభవం ఎంతో ఉంది. ప్రస్తుతం టెండ్ర్ అండ్ టాటా ఇంటర్నేషనల్‌కు చైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. నోయోల్ టాటా నాయకత్వంలో ఈ గ్రూప్ అత్యున్నత శిఖరాలు అందుకునే అవకాశముందనే ఓ చర్చ సాగుతుంది.

Ratan Tata: ఇంతకీ రతన్ టాటా వారసుడెవరూ?

ముంబయి, అక్టోబర్ 10: పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా బుధవారం మరణించారు. ఆయన మరణంతో.. దశాబ్దాల చరిత్ర కలిగిన టాటా గ్రూప్‌లో రతన్ టాటా శకం ముగిసినట్లు అయింది. దీంతో రతన్ టాటా వారసుడు ఎవరనే ఓ చర్చ అయితే ప్రారంభమైంది. టాటా గ్రూప్ చైర్మన్‌గా ఆ సంస్థ వ్యాపారాన్ని 4 బిలియన్ల డాలర్ల నుంచి 100 బిలియన్ల డాలర్లకు రతన్ టాటా తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అంత సత్తా ఉన్న వ్యక్తి టాటా ప్యామిలీలో ఎవరనే అంశం తాజాగా తెరపైకి వచ్చింది.

Also Read: బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో ‘హైడ్రా’ చర్యలు


ఆ క్రమంలో రతన్ టాటా సవతి సోదరుడు నోయోల్ టాటా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనకు ఈ టాటా గ్రూప్‌లో పని చేసిన అనుభవం ఎంతో ఉంది. ప్రస్తుతం టెండ్ర్ అండ్ టాటా ఇంటర్నేషనల్‌కు చైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. నోయోల్ టాటా నాయకత్వంలో ఈ గ్రూప్ అత్యున్నత శిఖరాలు అందుకునే అవకాశముందనే ఓ చర్చ సాగుతుంది. ఇక నోయోల్ టాటా పిల్లలు మాయ, నెవిల్లే, లేహ్ టాటాలు సైతం ఇదే టాటా గ్రూప్‌లోని వివిధ రంగాల్లో కీలక పదవుల్లో ఉన్నారు.

Also Read: సాక్షి పత్రిక కథనాలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు


లేహ్ టాటా. ఆమ వయస్సు 39 సంవత్సరాలు. టాటా ట్రస్ట్‌లోని కీలక బాధ్యతలను ఆమె పర్యవేక్షిస్తున్నారు. టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, టాటా సోషల్ వేల్ఫేర్ ట్రస్ట్, సార్వజనిక్ ట్రస్ట్‌తోపాటు ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటేడ్‌కు సైతం ఆమె సారథ్యం వహిస్తున్నారు. స్పెయిన్‌లోని ఐఈ బిజిసెన్ స్కూల్‌ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న ఆమె.. ప్రసిద్ది చెందిన తాజ్ హోటళ్లను చూస్తున్నారు.

Also Read: దసరా రోజు.. పాలపిట్టను ఎందుకు చూడాలంటే.. కారణాలు ఇవే?


మాయా టాటా. ఆమె వయస్సు 36 ఏళ్లు. ఆర్‌డీ టాటా ట్రస్ట్, టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, సర్వజనిక్ ట్రస్ట్‌ వ్యవహారాల్లో ఆమె కీలక భూమిక పోషిస్తున్నారు. యూకేలో బేయెస్ బిజినెస్ స్కూల్‌లో ఆమె ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఆ గ్రూప్‌లోని టాటా డిజిటల్‌లో ఆమె కీలకంగా వ్యవహరిస్తున్నారు.

Also Read: సాహిత్యంలో హాన్‌ కాంగ్‌కు నోబెల్ పురస్కారం


నెవిల్లే టాటా. 32 ఏళ్లు. టాటా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ వంటి పలు టాటా ట్రస్టుల్లో అతడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. యూకేలో బేయెస్ బిజినెస్ స్కూల్‌ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. మానసీ కిర్లోస్కర్‌ను వివాహం చేసుకున్న అతడికి ఇద్దరు సంతానం.

Also Read: రతన్ టాటాకి ఘోర అవమానం జరిగినా..?


రతన్ టాటా అవివాహితుడు.. అందుకే

రతన్ టాటా వివాహం చేసుకోలేదు. నాలుగు సార్లు ఆయన వివాహం చేసేందుకు ప్రయత్నించారు. కానీ చివరి నిమిషంలో అవి కాస్తా ఆగిపోయాయి. దీంతో రతన్ టాటా ఆజన్మబ్రహ్మచారిగానే ఉండిపోయారు. రతన్ టాటా 10 ఏళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు విడిపోయారు. నాటి నుంచి నానమ్మ వద్దే ఆయన పెరిగారు. ఇక రతన్ టాటా తండ్రి నావల్ టాటాకి రెండు వివాహాలు.

Also Read: ప్రపంచ కుబేరుల జాబితాలో రతన్ టాటా ఎందుకు లేరంటే..?

నావల్ టాటా.. సిమోన్ టాటాను వివాహం చేసుకున్నారు. వారికి నోయోల్ టాటా జన్మించారు. ఈ నేపథ్యంలో రతన్ టాటా వారసుడిగా నోయోల్ తీసుకునే అవాకాశాలున్నాయని ఓ ప్రచారం అయితే సాగుతుంది. అదీకాక నోయోల్ భార్య ఆలూ మిస్త్రీ. ఆమె మిస్త్రీ పల్లోంజి కుమార్తె. ఆమె సోదరుడే సైరస్ మిస్త్రీ. గతంలో టాటా సంస్థ చైర్మన్‌గా ఆయన పని చేసిన విషయం విధితమే.

Also Read: విలువ కట్టలేని రత్నాన్ని కోల్పోయిన భారత్

మరోవైపు టాటా సంస్థలకు వచ్చిన ఆదాయంలో దాదాపు 66 శాతం సేవా కార్యక్రమాలకు విరాళం ఇచ్చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రతన్ టాటా వారసుడి ఎంపిక వ్యవహారం అత్యంత కీలకంగా మారనుందని తెలుస్తుంది.

For National News And Telugu News

Updated Date - Oct 10 , 2024 | 09:18 PM