Health Tips : నిద్రలేవగానే ఈ సంకేతాలు హై బీపీ లక్షణాలు కావచ్చు.. ఇలాంటి లక్షణాలను చెక్ చేసుకోండి..!
ABN , Publish Date - Jul 02 , 2024 | 12:01 PM
ఉదయం నిద్ర లేవగానే తలతిరుగుతున్నట్లు అనిపిస్తే, ఇది అధిక రక్తపోటుకు కారణం కావచ్చు. మరికొన్ని సార్లు మంచం మీద నుంచి లేవగానే తల తిరుగుతున్నట్లు, మైకము వస్తుంది.
ఉదయాన్నే దాహం వేస్తుందా.. అదేం ప్రశ్న ఉదయాన్నే అందరికీ దాహం వేస్తుంది. గొంతు ఆరిపోయినట్టుగా ఉండి ఎప్పుడు మంచినీళ్ళు తాగుతామా అని ఎదురుచూస్తూ ఉంటారు. దాదాపు అరలీటరు నీరు తాగితేనే కానీ దాహం తీరినట్టుగా అనిపించదు. కనీసం గ్లాసు నీరైనా తాగాల్సిందే. అయితే ఈ లక్షణం కూడా అంత మంచిది కాదట. ఎందుకంటే ఉదయం నిద్రలేవగానే శరీరంలో అకస్మాత్తుగా కళ్ళు తిరగడం, మసగ్గా అనిపించడం ఉంటుంది. ఇదంతా అధిక రక్తపోటు సంకేతాలు కావచ్చట. బీపీ ఎక్కువగా ఉన్నట్లయితే ఎలాంటి లక్షణాలో తెలుసుకుందాం.
ప్రస్తుతం అధిక సంఖ్యలో ప్రజలు అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి వయసు భేధం కనిపించడంలేదు. అటు వృద్ధులు, యువకులు కూడా అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. దీనికి కారణం ఆహారం, సరైన జీవనశైలి అలవాట్లు లేకపోవడం ఇంకా కొన్ని జన్యపరమైన కారణాలు కూడా ఉండవచ్చు. ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల బీపీ సమస్యలు రావచ్చు. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో అనేక లక్షణాలు కలిపిస్తాయి. అనేక సార్లు ఉదయాన్నే శరీరం హై బీపీ సంకేతాలు ఇస్తుంది. ఉదయం రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో ఎలాంటి లక్షణాలుంటాయంటే..
రక్తపోటు పెరిగినప్పుడు ఉదయం లక్షణాలు..
అలసట..
రాత్రంతా నిద్రపోయిన తర్వాత ఉదయం అలసట, బలహీనంగా అనిపిస్తే, ఖచ్చితంగా రక్తపోటు టెస్ట్ చేయించుకోవాలి. కొన్ని సార్లు ఇది అధిక రక్తపోటు కారణంగా ఇలా జరుగుతుంది.
Children Health : వర్షాకాలంలో ఆరోగ్యకరమైన అలవాట్లతో పిల్లల ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..!
చూపు మసకబారడం
ఉదయం నిద్రలేచిన తర్వాత కొంతసేపటికి చూపు మందగించిన వారు బీపిని చెక్ చేసుకోవాలి. అధిక రక్తపోటు లక్షణం కావచ్చు. బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు కళ్లపై ఒత్తిడి ఉంటుంది. దృష్టి తగ్గుతుంది. కళ్లను బలహీనపరుస్తుంది.
వాంతులు అవుతున్నట్లు అనిపించడం..
నిద్రలేచిన వెంటనే వాంతులు, వికారం అనిపించినట్లయితే అవి అధిక రక్తపోటు లక్షణాలు కావచ్చు. శరీరంలో రక్త ప్రసరణ పెరిగినప్పుడు, నాడీ గందరగోళంగా ఉంటుంది. వాంతులు అవుతున్న ఫీలింగ్ ఉంటుంది.
Health Benefits : అంజీర్ ఎప్పుడు తినాలి. దీనితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి..!
తల తిరగడం..
ఉదయం నిద్ర లేవగానే తలతిరుగుతున్నట్లు అనిపిస్తే, ఇది అధిక రక్తపోటుకు కారణం కావచ్చు. మరికొన్ని సార్లు మంచం మీద నుంచి లేవగానే తల తిరుగుతున్నట్లు, మైకము వస్తుంది. బీపీని చెక్ చేసుకోవాలి, దీనికి కారణం బిపీ ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకోవాలి.
దాహంగా అనిపించినా..
రాత్రిపూట నీళ్లు తాగకపోవడం వల్ల ఉదయం దాహం వేస్తుంది. అయితే ఉదయం నిద్రలేచిన వెంటనే నోరు పొడిబారినట్టుగా అనిపిస్తే.. ఇవి హై బీపీ లక్షణాలు, శరీరంలో రక్తపోటు పెరిగినప్పుడు ఇది జరుగుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.