NRI: జాకీర్ హుస్సేన్ మృతిపై ఐఎఎఫ్ సంతాపం
ABN , Publish Date - Dec 16 , 2024 | 10:02 PM
సంగీతరంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారంగా భావించే గ్రామీ పురస్కారన్ని నాలుగు పర్యాయాలు అందుకున్న మహానీయులు జాకీర్ హెస్సేన్ అని కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాత తబలా వాయిద్య విద్వాంసుడు, పద్మవిభూషణ్ జాకీర్ హుస్సేన్ మృతి ప్రపంచంలోని సంగీత ప్రియులందరికీ తీరని లోటని ..
తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మృతి పట్ల ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఎఎఫ్‌సి) తీవ్ర సంతాపం ప్రకటించింది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సంస్థ కార్యవర్గ సమావేశంలో జాకీర్ హుస్సేన్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో ఐఎఎఫ్‌సి అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. సంగీతరంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారంగా భావించే గ్రామీ పురస్కారన్ని నాలుగు పర్యాయాలు అందుకున్న మహానీయులు జాకీర్ హెస్సేన్ అని కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాత తబలా వాయిద్య విద్వాంసుడు, పద్మవిభూషణ్ జాకీర్ హుస్సేన్ మృతి ప్రపంచంలోని సంగీత ప్రియులందరికీ తీరని లోటని అన్నారు.
పసి ప్రాయంలో ఏడు సంవత్సరాల వయస్సునుండే ఎంతో దీక్షతో తన తండ్రి, సంగీత విద్వాంసుడు అయిన అల్లా రఖా వద్ద తబలా వాయించడంలో మెళుకువలు నేర్చుకుని, విశ్వ వ్యాప్తంగా మేటి సంగీత విద్వాంసులైన రవిశంకర్, ఆలీ అఖ్బర్ ఖాన్, శివశంకర శర్మ, జాన్ మేక్లెగ్లిన్, ఎల్. శంకర్ లాంటి వారెందరితోనో 6 దశాబ్దలాగా ఎన్నోసార్లు, ఎన్నో విశ్వ వేదికలమీద సంగీతకచేరీలు చేసి అందరి అభిమానాన్ని చూరగొన్న జాకీర్ మృతిపట్ల వారి కుటుంబ సభ్యులుకు తీవ్ర సంతాపం తెలియజేస్తూ, జాకీర్ తో తనకున్న ప్రత్యక్ష పరిచయాన్ని, తాను జరిపిన ముఖా-ముఖీ కార్యక్రమం వివరాలను పంచుకున్నారు. ఈ సమావేశంలో ఐ ఎ ఎఫ్ సి ఉపాధ్యక్షులు తాయబ్ కుండా వాలా, రావు కల్వల, కార్యదర్శి మురళి వెన్నం, కోశాధికారి రన్నా జానీ, బోర్డ్ సభ్యులు రాంకీ చేబ్రోలు పాల్గొన్నారు.
అనారోగ్యంతో..
ప్రముఖ తబలా వాద్యకారుడు ఉస్తాక్ జాకీర్ హుస్సేన్ అనారోగ్యం కారణంగా అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గత వారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇన్నాళ్లు సంగీత ప్రపంచంలో యాక్టివ్‌గా ఉన్న జాకీర్ హుస్సేన్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ప్రస్తుత ముంబైలో జన్మించారు. ప్రసిద్ధ తబలా వాద్యకారుడు అయిన తన తండ్రి ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ దగ్గర తబలా వాయించే కళ నేర్చుకున్నారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జకీర్ యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి సంగీతంలో డాక్టరల్ డిగ్రీని పూర్తి చేశారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here