Indian Student Missing - Interpol Notice: భారత సంతతి అమెరికా విద్యార్థిని అదృశ్యం.. రంగంలోకి ఇంటర్‌పోల్
ABN , Publish Date - Mar 17 , 2025 | 10:47 PM
సెలవుల్లో డొమినికన్ రిపబ్లిక్‌కు వెళ్లి కనిపించకుండా పోయిన భారత సంతతి అమెరికా విద్యార్థి సుధీక్ష కొనంకీ జాడ కనుక్కునేందుకు ఇంటర్‌పోల్ రంగంలోకి దిగింది. ఆమె ఆచూకీ కోసం ఎల్లో నోటీసులు జారీ చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: భారత సంతతి అమెరికా విద్యార్థిని సుధీక్షా కొనంకీ అదృశ్యమైన ఘటనలో ఇంటర్‌పోల్ తాజాగా అలర్ట్ జారీ చేసింది. కనిపించకుండా పోయిన వ్యక్తులు, కిడ్నాప్ అనుమానాలు ఉన్న ఘటనలకు సంబంధించి పసుపు పచ్చ నోటీసులను ప్రపంచవ్యాప్తంగా జారీ చేసింది.
పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సుధీక్షా డొమినికన్ రిపబ్లిక్ దేశ పర్యటనకు వెళ్లి అదృశ్యమైన విషయం తెలిసిందే. తన కాలేజీ స్నేహితులతో పాటు హాలుడే కోసం ఆమె వెళ్లింది. సుధీక్షా అదృశ్యమైన రోజు ఆమె వెంట సెయింట్ క్లౌడ్ యూనివర్సిటీ సీనియర్ జాషువా రైబ్ ఉన్నాడు.
Also Read: గ్రీన్‌కార్డుదారులపైనా పెరుగుతున్న తనిఖీలు.. ఎన్నారైల్లో మొదలైన గుబులు
తాము సముద్రంలోకి నడుము లోతు వరకూ వెళ్లగా పెద్ద అల వచ్చి తమను ఉక్కిరిబిక్కిరి చేసిందని అతడు చెప్పాడు. ఆ తరువాత తాము ఇద్దరం కష్టపడి ఒడ్డుకు చేరుకోగా సముద్రం నీరు మింగిన సుధీక్ష వాంతులు చేసుకుందని అన్నాడు. తాను అక్కడే పడిపోయానని, మెళకువ వచ్చి చూస్తే ఆమె కనిపించలేదని తెలిపాడు. ఆమె తనంతట తాను హోటల్‌కు వెళ్లి ఉంటుందని భావించి తానూ వెనుదిరిగినట్టు చెప్పాడు. కాగా, సీసీటీవీ కెమెరా ఫుటేజీలో సుధీక్షా, జాషువా కలిసి బీచ్‌లో నడుస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.
Also Read: గల్ఫ్ దేశాలలో ఘనంగా జనసేన ఆవిర్భావ ఉత్సవాలు
సుధీక్షా సముద్రంలో మునిగి మరణించినట్టు తొలుత స్థానిక పోలీసులు భావించారు. అయితే, ఆమె అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైనట్టు కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్త చేయడంతో పోలీసులు ఇతర కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సుధీక్షా తన వెంటనే ఫోను, పర్సు తీసుకెళ్లకపోవడం సందేహిస్తోందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా తన వెంటన ఫోను, పర్సు తీసుకెళుతుందని అన్నారు. వాటిని స్నేహితుల వద్ద వదలడం వింతగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసుల లోతైన దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: డిట్రాయిట్ వేదికగా తానా పండుగకు సన్నాహాలు ప్రారంభం
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..