Greencard Holders Increased Scrutiny: గ్రీన్‌కార్డుదారులపైనా పెరుగుతున్న తనిఖీలు.. ఎన్నారైల్లో మొదలైన గుబులు
ABN , Publish Date - Mar 17 , 2025 | 09:11 PM
ట్రంప్ హయాంలో గ్రీన్‌కార్డులకూ కంటిమీద కునుకు లేకుండా పోతోంది. తనిఖీలు పెరగడంతో అనేక మందికి తాము అమెరికా వీడాల్సి వస్తుందన్న భయం మొదలైంది.

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు అమెరికాలో వీసాలపై నివసిస్తున్న వారే ఆందోళనలో ఉండేవారు. కానీ గ్రీన్ కార్డు ఉన్న వారు కూడా టెన్షన్‌తో కంటి మీద కునుకు లేకుండా గడిపే రోజులు వచ్చేశాయి. ట్రంప్ ప్రభుత్వం
ఉక్కుపాదం మోపుతుండటంతో అమెరికాలో విదేశీయుల వీసాలు, గ్రీన్ కార్డులు, పర్యటనలపై నిఘా పెరిగిందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇటీవల జర్మనీ దేశస్థుడు ఫేబియన్ ష్మిడ్‌ను గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ అదుపులోకి తీసుకోవడం, తనిఖీల పేరిట దుస్తులు తొలగించడం, ఇంటరాగేషన్ చేయడం సంచలనంగా మారింది. గ్రీన్ కార్డు దారుల్లో అనేక మందిని రాత్రంతా కస్టడీలో ఉంచి ప్రశ్నించడం, సెకెండరీ ఇన్‌స్పెక్షన్లు నిర్వహించడం, గ్రీన్ కార్డును సరెండర్ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి (Greencard Holders Face Increased Scrutiny).
Also Read: గల్ఫ్ దేశాలలో ఘనంగా జనసేన ఆవిర్భావ ఉత్సవాలు
గ్రీన్‌కార్డు ఉన్న భారతీయ వద్ధులు ఎక్కువ కాలం పాటు విదేశాల్లో ఉండటంతో అధికారుల దృష్టి వారిపై పడుతోందని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. కొందరితో బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారన్న వార్తలు వైరల్‌గా మారాయి. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి చర్యలు చట్టం ముందు నిలబడవని, ప్రభుత్వం కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అక్కడి లాయర్లు చెబుతున్నారు.
అమెరికాకే తొలి ప్రాధాన్యత అంటూ రంగంలోకి దిగిన ట్రంప్ వలసలపై కఠిన వైఖరి అవలంబించడంతో అధికారులు కూడా నిబంధనలు కఠినంగా అమలు చేయడంపై దృష్టిపెట్టారని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువ కాలం విదేశాల్లో గడిపే గ్రీన్‌కార్డుదారులు, నేర చరిత్ర కలవారు, దేశ భద్రతాపరంగా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్న వారిపై అక్కడి అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారట.
Also Read: డిట్రాయిట్ వేదికగా తానా పండుగకు సన్నాహాలు ప్రారంభం
ఇక విదేశాల్లో ఆరు నెలలకు పూైగా గడిపేవారిని అధికారులు ప్రశ్నించే అవకాశం గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. ఇక ఏడాదికి పైగా ఉంటే మాత్రం ఆటోమేటిక్‌గా నష్టపోయే ప్రమాదం పెరిగిందట. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై దేశబహిష్కరణ విధించే అవకాశం ఉంది.
ఇక అమెరికాలోని విదేశీయుల్లో సంఖ్యా పరంగా రెండో స్థానంలో ఉన్న భారతీయులు కూడా అధికారుల తనిఖీలకు టార్గెట్‌గా మారే ముప్పు పెరిగింది. ప్రస్తుతం గ్రీన్ కార్డు కోసం దాదాపు ఒక మిలియన్ మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు. తనిఖీలు పెరుగుతున్న నేపథ్యంలో తాము దేశ బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. పౌరసత్వం ఇచ్చిన స్థాయిలో గ్రీన్ కార్డు ద్వారా రక్షణ లభించకపోవచ్చన్న చర్చ ఆన్‌లైన్ వేదికల్లో విస్తృతంగా జరుగుతోంది.
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..