Share News

Viral: ఈ పిల్లి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. పిల్లి పిల్ల కోసం కుక్కలతో ఫైట్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

ABN , Publish Date - Sep 24 , 2024 | 02:57 PM

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే గొప్పది ఇంకేమీ లేదు. తల్లి ప్రేమను, అనురాగాన్ని మించిన రక్షణ లేదు. మనుషులే కాదు.. జంతువులు కూడా తమ పిల్లల కోసం ఏం చేయడానికైనా వెనుకాడవు. ఆపద నుంచి పిల్లలను కాపాడడానికి ఎంతకైనా తెగిస్తాయి. తాజాగా అలాంటిదే ఓ ఘటన జరిగింది.

Viral: ఈ పిల్లి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. పిల్లి పిల్ల కోసం కుక్కలతో ఫైట్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
cat fought with dogs

ఈ ప్రపంచంలో తల్లి (Mother) ప్రేమ కంటే గొప్పది ఇంకేమీ లేదు. తల్లి ప్రేమను, అనురాగాన్ని మించిన రక్షణ లేదు. మనుషులే కాదు.. జంతువులు కూడా తమ పిల్లల కోసం ఏం చేయడానికైనా వెనుకాడవు. ఆపద నుంచి పిల్లలను కాపాడడానికి ఎంతకైనా తెగిస్తాయి. తాజాగా అలాంటిదే ఓ ఘటన జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో రెడ్డిట్‌లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ పిల్లి (Cat) తన బిడ్డ (Kitten) కోసం నాలుగు కుక్కలతో (Dogs) ఫైట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ చిన్న పిల్లి పిల్లను రోడ్డు మీద నాలుగు పెద్ద కుక్కలు ఆడ్డుకున్నాయి. దానిని చుట్టు ముట్టి దాడి చేసేందుకు ప్రయత్నించాయి. బిడ్డకు ఎదురైన ఆపదను చూసిన పెద్ద పిల్లి వెంటనే రంగంలోకి దిగింది. ఆ నాలుగు కుక్కలను నిలువరించింది. గట్టిగా అరుస్తూ ఆ నాలుగు కుక్కలతోనూ పోరాడింది. ఆ సమయంలో ఆ చిన్న పిల్లి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. దీంతో ఆ కుక్కలు పెద్ద పిల్లిపై దాడికి దిగాయి. కాసేపు అరిచిన ఆ పెద్ద పిల్లి కూడా వేగంగా అక్కడి నుంచి పరారైంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో రెడ్డిట్‌లో షేర్ అయింది.


ఆ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు పిల్లి ధైర్యంపై ప్రశంసలు కురిపించారు. ``ఈ ప్రపంచంలో తల్లిని మించిన సూపర్ హీరో ఎవరుంటారు``, ``ఆ పిల్లి ధైర్యానికి హ్యాట్సాఫ్``, ``తన బిడ్డ కోసం తల్లి ఎంతటి ఆపదకైనా ఎదురువెళ్తుంది``, ``ఆ చిన్ని పిల్లి అదృష్టవంతురాలు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ ఆటోవాలా తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఆటోలో ఎలాంటి కుర్చీ పెట్టుకున్నాడో చూడండి..


Viral Video: ఐఫోన్ మేనియా ఆ రేంజ్‌లో ఉంది మరి.. ఈ ఐఫోన్ వాటర్ ప్రూఫ్ మాత్రమే కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కూడా..


Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి పరీక్ష.. ఈ రెండు ఫొటోల్లోని తేడాలను 15 సెకెన్లలో పట్టుకోండి..


Viral Video: మనవడి కోసం వినూత్న ట్రెడ్‌మిల్ తయారు చేసిన తాత.. ఆ కుర్రాడి బాధలు చూస్తే నవ్వు రాక తప్పదు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 24 , 2024 | 02:57 PM