Breaking Bad Habits: ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు.. ఎంత చెడ్డ అలవాట్లు అయినా ఈజీగా వదిలించుకోవచ్చు..!
ABN , Publish Date - Feb 05 , 2024 | 01:40 PM
చెడు అలవాట్ల వల్ల జీవితంలో చాలా నష్టం జరుగుతుంది. వీటని వదిలించుకోవడానికి ఈ 5 టిప్స్ సహాయపడతాయి.
చెడు అలవాట్లు మనిషి జీవితంలో చాలా నష్టాన్ని కలిగిస్తాయి. గెలుపుకు దూరం చెయ్యడం నుండి వ్యక్తిత్వపరంగా ఎదుగుదల లేకపోవడం, సామాజిక, ఆర్థిక విషయాలలో దెబ్బతీయడం వరకు చాలా నష్టాలుంటాయి. ఈ నష్టం గురించి ఒక అవగాహన వచ్చాక వాటిని వదిలించుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. అయితే చెడు అలవాట్లు వదిలించుకోవడం అంత సులభమేమీ కాదు.. దీనికోసం చాలా కష్టపడి విజయం సాధించేవారు కొందరైతే మధ్యలోనే చేతులెత్తేసేవారు మరికొందరు. అయితే ఈ 5 టిప్స్ సహాయంతో ఎంత చెడ్డ అలవాట్లను అయినా ఈజీగా వదిలించుకోవచ్చు. అవేంటో తెలుసుకుంటే..
కారణాలు, లాభాలు..
అసలు చెడు అలవాటు ఎందుకు ఏ కారణంగా వస్తోందనే విషయాన్ని గుర్తించాలి. ఏ బలహీనత చెడు అలవాటుకు బానిసగా మార్చాయో అర్థం చేసుకోవాలి. ఆ అలవాటును వదిలేస్తే కలిగే లాభాలను గుర్తుచేసుకోవాలి. అప్పుడు జీవితం ఎంత అందంగా ఉంటుందో ఊహించుకోవాలి. అంతే చెడు అలవాట్లను వదిలేయడానికి ఇష్టంగా సిద్దమవుతారు. చెడు అలవాటు గుర్తొచ్చినప్పుడు, నడక, వ్యాయామం, ధ్యానం వంటివి చేయాలి. వీటితో చెడు అలవాట్లు అధిగమించడం సులభం.
ఇది కూడా చదవండి: తల్లిదండ్రులు ఈ 9పనులు చేస్తే చాలు.. పిల్లలలో కొండంత ఆత్మవిశ్వాసం నిండుకుంటుంది..!
ప్రణాళిక..
మంచి ప్రణాళిక రూపొందించుకుంటే చెడు అలవాట్లు వదులుకోవడం సులువు అవుతుంది. ఛాలెంజ్ లను స్వీకరించడం, లక్ష్యాలను నిర్దేశించుకోవడం, చిన్న చిన్న విజయాలను కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం మొదలైవని చెడు అలవాట్లను దూరం చేస్తాయి. వ్యక్తిత్వ పరంగా బలంగా మారేకొద్దీ చెడు అలవాట్ల ప్రభావం తగ్గుతుంది.
ప్రవర్తన, ఫలితాలు..
చెడు అలవాట్లు వదిలెయ్యడానికి ఏం చేస్తున్నారు? దాని వల్ల వస్తున్న ఫలితాలు ఎలా ఉన్నాయి? చెడు అలవాట్లు దూరంగా ఉన్న సమయాలలో ప్రవర్తన ఎలా ఉంది అనే విషయాలు ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవాలి. కనిపించే ప్రతి చిన్న మార్పు మరింత కృషి చేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది.
సపోర్ట్..
చెడు అలవాట్లు మానేయడానికి ఒంటరిగా పోరాడటం కంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, చెడు అలవాట్లు మానేయడానికి ప్రయత్నిస్తున్న వారు, చెడు అలవాట్లు మానేయడంలో విజయం సాధించిన వారి సహాయం తీసుకోవాలి. వారి సలహాలు, సూచనలు, వారి ప్రేరణాత్మక బోధనలు చెడు అలవాట్లు వదిలేయడంలో మరింత దోహదపడతాయి.
ఇది కూడా చదవండి: ఆరోగ్యానికి మంచిది కదా అని బీట్రూట్ ఎక్కువగా తింటే జరిగేదిదే..!
ఓర్పు అవసరం..
చెడు అలవాట్లు వదులుకోవడానికి ఓర్పు చాలా అవసరం. అది ఒకటి రెండురోజులలో జరిగేది కాదు. ప్రతి చిన్న విషయం నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి ప్రయత్నాన్ని మనస్పూర్తిగా చెయ్యాలి. మధ్యలో వదిలే ఆలోచన వచ్చిన ప్రతిసారీ.. అసలు ఈ ప్రయాణం ఎందుకు మొదలుపెట్టాం అనే విషయాన్ని గుర్తుచేసుకోవాలి.
మరిన్ని జీవనశైలి వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.