Share News

Viral Video: వామ్మో.. ఈ బండిని రాత్రి చూస్తే దడుసుకోవాల్సిందే..! సిగరెట్ బండిని ఎలా డిజైన్ చేశారో చూడండి..!

ABN , Publish Date - Jul 19 , 2024 | 11:15 AM

తమ తెలివితేటలతో, తమ క్రియేటివిటీతో ఏదైనా విభిన్నంగా చేసి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించేవారికి ప్రస్తుతం కొదవ లేదు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు రూపొందించే వీడియోలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మరికొందరు రూపొందించే వీడియోలు చాలా విచిత్రంగా ఉంటాయి.

Viral Video: వామ్మో.. ఈ బండిని రాత్రి చూస్తే దడుసుకోవాల్సిందే..! సిగరెట్ బండిని ఎలా డిజైన్ చేశారో చూడండి..!
Skull Vehicle

తమ తెలివితేటలతో, తమ క్రియేటివిటీ (Creativity)తో ఏదైనా విభిన్నంగా చేసి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించేవారికి ప్రస్తుతం కొదవ లేదు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు రూపొందించే వీడియోలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మరికొందరు రూపొందించే వీడియోలు చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నవ్వాలో, ఏడవాలో కూడా తెలియదు. కేవలం సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకే ఓ వ్యక్తి విచిత్రమైన వాహనాన్ని రూపొందించాడు (Viral Video).


nitinumbaranikar అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పెద్ద పుర్రె (Skull) ఆకారంలో ఉన్న ఓ వాహనం రోడ్డుపై వెళుతోంది. ఆ పుర్రెకు ఉన్న పెద్ద పళ్ల మధ్య ఓ పెద్ద సిగెరెట్ (cigarette) కాలుతూ ఉంది. ఆ పుర్రెకు దిగిన చక్రాలను బిగించారు (Skull Vehicle). చాలా భయంకరంగా ఉన్న ఆ పుర్రె వాహనాన్ని చూసి రోడ్డు పై కుక్కలు మొరుగుతున్నాయి. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు షాకవుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోకు మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. 56 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``దయచేసి ఈ వాహనాన్ని రాత్రిపూట బయటకు తీసుకురాకండి``, ``చాలా భయంకరంగా ఉంది``, ``ఇంజినీర్ సర్.. మీరు ఏం చెప్పదలచుకున్నారు``, ``దీనిని సిగరెట్ వెహికల్ అని పిలవాలా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: అక్కడ రాళ్లే కాదు.. ఓ ఉంగరం కూడా ఉంది.. ఫోకస్ పెట్టి 10 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral: భార్య ట్యాబ్ ఓపెన్ చేసిన భర్తకు దిమ్మదిరిగే షాక్.. అందులో ఫొటోలు చూసి భర్త తీసుకున్న నిర్ణయం ఏంటంటే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 19 , 2024 | 11:15 AM