Share News

Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రోజు రోజుకు తగ్గుతున్న బంగారం ధరలు

ABN , Publish Date - Apr 06 , 2025 | 07:35 AM

To Day Gold Rates: బంగారం కొనాలనుకునే వారికి నిజంగా ఇది గుడ్‌న్యూస్ అని చెప్పాలి. మొన్నటితో పోల్చుకుంటే నిన్న బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం.. గ్రాము ధర నిన్న 8,310 రూపాయలు ఉండగా.. పది గ్రాముల ధర 83100 రూపాయలు ఉండింది. ఈ రోజు బంగారం ధరల విషయానికి వస్తే..

Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రోజు రోజుకు తగ్గుతున్న బంగారం ధరలు
To Day Gold Rates

బంగారం అంటే ఇష్టపడని ఆడవాళ్లు ఎవరుంటారు చెప్పండి. ఎన్ని లక్షలు పెట్టి బంగారం కొన్నా కూడా.. ‘ ఒకటి తక్కువైంది’ అని అంటారే కానీ, ఇక చాలు అని ఎవ్వరూ అనరు. అందుకే దేశంలో బంగారానికి డిమాండ్ పీక్స్‌లో ఉంటోంది. గత ఆరు నెలల్లో బంగారం ధర దాదాపు 15 వేల రూపాయల వరకు పెరిగింది. పసిడి ప్రియులకు ఊహించని షాక్ ఇచ్చింది. 63 వేల నుంచి 90 వేల దగ్గరకు వచ్చింది. బంగారం కొనాలంటేనే భయపడేలా చేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. మొన్నటి నుంచి తగ్గుతూ వస్తున్నాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర భారీగా తగ్గింది.


22 క్యారెట్ల బంగారం.. గ్రాము ధర నిన్న 8,310 రూపాయలు ఉండగా.. పది గ్రాముల ధర 83100 రూపాయలు ఉండింది. ఇక, 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. గ్రాము 9,066 రూపాయలు ఉండగా.. పది గ్రాముల ధర 90,660 ఉండింది. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే.. నిన్నటికంటే ఈ రోజు బంగారం ధరలు పెరగలేదు.. తగ్గలేదు. నిన్నటి లాగే 22 గ్రాముల బంగారం ధర .. గ్రాము 8,310 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల బంగారం కూడా గ్రాము 9,066 రూపాయలు గానే ఉంది.


ఇక, సిల్వర్ విషయానికి వస్తే.. గ్రాము సిల్వర్ ధర 103 రూపాయలు ఉంది. కేజీ సిల్వర్ ధర 1,03,000 రూపాయలు ఉంది. సిల్వర్ కూడా ఏప్రిల్ 4వ తేదీతో పోల్చుకుంటే నిన్న, ఈ రోజు ధరలు బాగా తగ్గాయి. మొన్న పది గ్రాముల వెండి ధర 1,080 రూపాయలు ఉండింది. ఈ రోజు ధర చూస్తే.. 10 గ్రాములు 1,030 రూపాయలు ఉంది. బంగారం కానీ, సిల్వర్ కానీ కొనాలనుకునే వారు ఇప్పుడే కొనేస్తే చాలా మంచిది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

CM Chandrababu: డబ్బునోళ్లంతా ఆ పని చేయండి.. సీఎం చంద్రబాబు పిలుపు

Vaishnavi Chaitanya: ఫస్ట్‌లవ్‌ఎప్పటికీ సమ్‌థింగ్‌ స్పెషలే...

Updated Date - Apr 06 , 2025 | 07:40 AM