Viral: షాకింగ్! పెళ్లివేదికపై ఉన్న ఈ వరుడు ఫోన్‌లో ఏం చూస్తున్నాడో తెలిస్తే..
ABN , Publish Date - Nov 30 , 2024 | 07:58 PM
ఓ పెళ్లిలో వరుడు లోకాన్ని మర్చిపోయి మొబైల్‌లో ట్రేడింగ్ గ్రాఫ్‌లు చూస్తూ బిజీబిజీగా గడిపేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. జనాలు విస్తుపోయేలా చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఓ దశాబ్దం క్రితం ఉద్యోగం అంటే ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటలకు ముగిసేది. ఉద్యోగులందరూ ఇళ్లకు చేరుకున్నాక ఆఫీసు విషయాలు మర్చిపోయి సేద తీరే వారు. ప్రస్తుత పరిస్థితులు మాత్రం పూర్తి తలకిందులుగా మారిపోయాయి. లక్షల సంపాదన ఓవైపు.. క్షణం తీరకలేని జీవితం మరోవైపు..అన్నట్టుగా మారిపోయింది. అనేక మంది కార్పొరేట్ ఉద్యోగులకు జాబ్‌యే జీవితంగా మారిపోయింది. ఇందుకు తాజాగా ఉదాహరణగా వైరల్ అవుతున్న వీడియో కొందరికి నవ్వు తెప్పిస్తుంటే మరికొందరికి విచారం కలిగిస్తోంది (Viral).
Viral: ఊహించని ట్విస్ట్! భార్య కోసం రూ.3.4 లక్షల బంగారు నగలు కొంటే..
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, వరుడు పెళ్లివేదికపై ఉన్న కూర్చీలో కూర్చున్నాడు. మరి కాసేపట్లో పెళ్లనగా వరుడు మాత్రం మొబైల్ చూడటంలో మునిగిపోయాడు. తనకు పెళ్లన్న విషయాన్నే మర్చిపోయి మొబైల్‌లో మునిగిపోయిన వరుడిని చూసి వెనకున్న వారు ఆశ్చర్యపోయారు. అతడేం చేస్తున్నాడో చూసి నవ్వాపుకోలేకపోయారు. వరుడు ఆ రోజు ట్రెడింగ్ తీరుతెన్నులను గమనిస్తూ తనను తానే మర్చిపోయాడు. దీంతో, వెనకున్న వారు ఇదంతా వీడియోలో రికార్డు చేసి నెట్టింట పోస్టు చేయడంతో ఈ ఉదంతం ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
Viral: 100 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండే చీర.. నీతా అంబానీ ఫేవరెట్!
ఈ వీడియో చూసిన జనాలు కూడా రకరకాల కామెంట్స్ చేశారు. ‘‘పెళ్లి నాటి ప్రమాణాల కంటే ఈ వరుడికి తన పోర్ట్ ఫోలియోనే ముఖ్యమన్నట్టు ఉంది’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ట్రేడర్లు ఇలాగే ఉంటారని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. ఒకేసారి పది పనులు చక్కబెట్టే మల్టీ టాస్కింగ్ అంటే ఇదే అని ఇంకో వ్యక్తి అభిప్రాయపడ్డారు.
మరికొందరు మాత్రం వరుడి తీరు చూసి పెదవి విరిచారు. జీవితాల్లోకి చొచ్చుకొచ్చేసిన టెక్నాలజీ మనషుల్ని బానిసలుగా మార్చేస్తోందని వ్యాఖ్యానించారు. నేటి జమానాలో ఉద్యోగులకు వ్యక్తిగత జీవితమంటూ లేకుండా పోయిందని కొందరు వాపోయారు. స్టాక్ మార్కెట్‌ను తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. జనాలు నోరెళ్ల బెట్టేలా చేస్తోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Viral: కాలిపై పిల్లి రక్కడంతో తెగిన నరం.. తీవ్ర రక్తస్రావమై యజమాని మృతి!
Viral: యువతులతో కలిసి ఏనుగు భరతనాట్యం! జరిగింది తెలిస్తే కన్నీళ్లు ఆగవ్!