Share News

Kitchen Tips: నల్లగా మారిన పాన్ ను ఇలా క్లీన్ చేసి చూడండి.. కొత్తదానిలా మెరుస్తుంది..!

ABN , Publish Date - Jun 28 , 2024 | 12:11 PM

దోసెలు, చపాతీలు, పరాతాలు, రొట్టెలు మొదలైనవన్నీ పాన్ మీదనే చేస్తుంటారు. అయితే వీటిని వాడేకొద్ది పాన్ మీద నల్లగా బొగ్గులాగా ఒక పొర ఏర్పడుతుంది. రొట్టెల తాలూకు పిండి, రొట్టెలు కాల్చడానికి ఉపయోగించిన నూనె పాన్ మీద పేరుకుపోవడం వల్ల ఇలా బొగ్గులాగా ఏర్పడుతుంది. దీన్ని శుభ్రం చేయడం

Kitchen Tips: నల్లగా మారిన పాన్ ను ఇలా క్లీన్ చేసి చూడండి.. కొత్తదానిలా మెరుస్తుంది..!

వంటగదిలో పాన్ లేదా పెనం కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దోసెలు, చపాతీలు, పరాతాలు, రొట్టెలు మొదలైనవన్నీ పాన్ మీదనే చేస్తుంటారు. అయితే వీటిని వాడేకొద్ది పాన్ మీద నల్లగా బొగ్గులాగా ఒక పొర ఏర్పడుతుంది. రొట్టెల తాలూకు పిండి, రొట్టెలు కాల్చడానికి ఉపయోగించిన నూనె పాన్ మీద పేరుకుపోవడం వల్ల ఇలా బొగ్గులాగా ఏర్పడుతుంది. దీన్ని శుభ్రం చేయడం చేతకాక చాలామంది కొత్త పాన్ కొంటూ ఉంటారు. అయితే ఎక్కువ ఖర్చు లేకుండా ఈ కింది పద్దతిలో శుభ్రం చేస్తే నల్లగా మారిన పాన్ కొత్తదానిలా మెరుస్తుంది. ఆ చిట్కా ఏంటో తెలుసుకుంటే..

Curd: వర్షాకాలంలో పెరుగు తినేవారికి అలెర్ట్.. ఈ నిజాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!



నల్లగా ఉన్న పాన్ ను శుభ్రం చేయడానికి నిమ్మకాయ, ఉప్పు, కొద్దిగా షాంపూ అవసరం అవుతాయి. ముందుగా పాన్ ను స్టౌ మీద ఉంచి వేడిచేయాలి. వేడి వేడి పాన్ మీద షాంపూ వేసి దానిలో ఒక చెంచా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కూడా వేసి పాన్ అంతా పట్టించాలి. ఇప్పుడు నిమ్మతొక్కలతో పాన్ అంతా రుద్దాలి. ఇలా చేయడం వల్ల పాన్ మీద పేరుకుపోయిన నూనె, మురికి శుభ్రమవుతాయి. దీని తరువాత పాన్ ను సింక్ లో సాధారణ డిష్ వాష్ జెల్ తో కడగాలి. ఇలా చేస్తే పాన్ పూర్తీగా శుభ్రమవుతుంది. పాన్ కొత్తదానిలా మెరుస్తుంది.

Bronze Massage: అరికాళ్లకు కాంస్య పాత్రతో మసాజ్ చేస్తే ఈ సమస్యలన్నీ మాయం..!



మరొక చిట్కా..

నల్లగా మారిన పాన్ ను శుభ్రపరిచే మరొక చిట్కా కూడా ఉంది . పాన్ మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మురికి, నూనె తొలగించడానికి ఒక గిన్నెలో కొంచెం నిమ్మరసం తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా డిటర్జెంట్, కొద్దిగా ఇసుక లేదా ఇటుక పొడి వేయాలి. దీన్ని స్ర్కబ్బర్ తో తీసుకుని పాన్ పై వేసి బాగా రుద్దాలి. దీంతో పాన్ మీద మురికి, నలుపు, జిడ్డు అంతా వదిలిపోతుంది. కావాలంటే వైట్ వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు. పాన్ వేడి చేసి నిమ్మరసం, వైట్ వెనిగర్ వేసి స్ర్కబ్ తో బాగా రుద్ది శుభ్రం చేయాలి.

Health tips: మీరు సిట్టింగ్ వర్క్ చేస్తుంటారా? జాగ్రత్తపడకుంటే ఈ 9 సమస్యలు రావడం పక్కా..!

Curd: వర్షాకాలంలో పెరుగు తినేవారికి అలెర్ట్.. ఈ నిజాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.


Updated Date - Jun 28 , 2024 | 12:11 PM