Share News

Viral Video: బైకుపై స్విమ్మింగ్ పూల్.. ఎండ వేడి తట్టుకునేలా ఇతను చేసుకున్న ఏర్పాట్లు చూడండి..

ABN , Publish Date - Jun 01 , 2024 | 06:13 PM

మే నెల ముగియడంతో పాటూ అడపాతడపా వర్షాలు కురుస్తున్నా ఎండ వేడి మాత్రం తగ్గడం లేదు. పైగా రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో చాలా మంది ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో..

Viral Video: బైకుపై స్విమ్మింగ్ పూల్.. ఎండ వేడి తట్టుకునేలా ఇతను చేసుకున్న ఏర్పాట్లు చూడండి..

మే నెల ముగియడంతో పాటూ అడపాతడపా వర్షాలు కురుస్తున్నా ఎండ వేడి మాత్రం తగ్గడం లేదు. పైగా రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో చాలా మంది ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు విచిత్ర ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరచడం చూస్తూనే ఉన్నాం. లారీ నడుపుతూ స్నానం చేసే డ్రైవర్‌ను చూశాం, కారు లోపల స్విమ్మింగ్ పూల్ తరహా ఏర్పాట్లు చేసుకుని, ఎంజాయ్ చేసే యువకులను కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి బైకులో వెళ్తూ స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి.. బైకులో వెళ్తున్న సమయంలో ఎండ వేడి తగలకుండా ఏదైనా వినూత్నంగా చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం చివరకు విచిత్ర ప్రయోగం (experiment) చేశాడు. ముందుగా అతను ఓ పాత పాస్టిక్ డ్రమ్మును (Plastic drum) తీసుకొచ్చాడు. దాన్నికి కొన్ని రంధ్రాలు చేసి చేతులు, కాళ్లు, తల బయటికి కనిపించేలా ఫిట్ చేశాడు. ఇలా డ్రమ్మును కట్ చేసిన తర్వాత.. అందులో కూర్చుని కాళ్లు, చేతులు బయటికి పెట్టాడు. అలాగే స్కూటర్‌పై కూర్చున్నాడు. తర్వాత ఆ డ్రమ్ము నిండుగా నీళ్లు పట్టారు.

Viral Video: హోటల్ గదిలోకి వెళ్లే ముందు యువతులు చేయాల్సిన పనులివే.. ఈమె ఏం చేసిందో చూస్తే..


చివరగా అతను ఓ వైపు స్కూటర్ నడుపుతూనే, మరోవైపు డ్రమ్ము నీటిలో స్నానం కూడా చేస్తున్నాడు. ఇలా ఈ వ్యక్తి స్కూటర్‌పై వెళ్లే సమయంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎవరూ లేని సమయంలో ఆఫీసులో యువతి నిర్వాకం.. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. అవాక్కయ్యే సీన్..

Updated Date - Jun 01 , 2024 | 06:13 PM