Viral Video: హోటల్ గదిలోకి వెళ్లే ముందు యువతులు చేయాల్సిన పనులివే.. ఈమె ఏం చేసిందో చూస్తే..
ABN , Publish Date - Jun 01 , 2024 | 04:27 PM
ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కొందరికి ఇంటా, బయటా సమస్యలే ఎదురవుతుంటాయి. అలాగే కొత్త ప్రదేశంలోకి వెళ్లిన సందర్భాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మోసపోయే ప్రమాదం ఉంటుంది. మరోవైపు..
ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కొందరికి ఇంటా, బయటా సమస్యలే ఎదురవుతుంటాయి. అలాగే కొత్త ప్రదేశంలోకి వెళ్లిన సందర్భాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మోసపోయే ప్రమాదం ఉంటుంది. మరోవైపు ఏదైనా హోటల్ గదిలోకి వెళ్లిన సందర్భాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏ సీక్రెట్ కెమెరా ఉంటుందో తెలీని పరిస్థితి. ఇలాంటి సమయాల్లో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి హోటల్ గదిలోకి వెళ్లిన సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ వీడియో చేసింది. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హోటల్ గదుల్లోకి (Hotel room) వెళ్లిన సందర్భాల్లో మహిళలను (women) తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఆమె ఈ వీడియో చూసింది. గదిలోకి వెళ్లిన సమయంలో ఆమె తన వెంట కొన్ని వస్తువులను తీసుకెళ్లింది. ముందుగా గదిలోకి వెళ్లే ముందు డోరుకు ఉన్న రంధ్రాన్ని తన వద్ద ఉన్న స్టిక్కర్‌తో మూసేసింది. ఆ తర్వాత డోర్ లాక్ బయటికి నుంచి ఎవరూ తీసే అవకాశం లేకుండా వెంట తెంచుకున్న వస్తువుతో జాగ్రత్తలు తీసుకుంది.
తర్వాత తన వెంట తెచ్చుకున్న సీసీ కెమెరాను గోడకు అమర్చింది. ఈ తర్వాత సీక్రెట్ కెమెరాను గర్తించే వస్తువుతో (Detecting secret cameras) లోపల మొత్తం పరిశీలించింది. ఎక్కడా సీక్రెట్ కెమెరాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత.. తన వద్ద ఉన్న టిష్యూ పేపర్లతో (Tissue papers) గదిలోని ల్యాండ్ ఫోన్లు తదితరాను శుభ్రం చేసింది. అదేవిధంగా బాత్రూం కమోడ్‌కు కూడా టిష్యూ కవర్ తొడిగి పరిశుభ్రంగా ఉంచుకుంది.
Viral Video: ఎగ్జిబిషన్‌ను కూడా వదల్లేదు.. జాయింట్ వీల్లో ప్రేమికుల నిర్వాకం చూస్తే..
అంతా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరిస్తూ వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రస్తుత సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరి’’.. అంటూ కొందరు, ‘‘చాలా చక్కగా వివరించారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఎంత బ్రతిమాలుతున్నా వరుడు వినలేదని.. బంధువుల సమక్షంలోనే ఈ వధువు చేసిన పని..