Share News

Viral: అద్భుతం.. గంగానది నీటిని మైక్రోస్కోప్‌లో చూస్తే..

ABN , Publish Date - Dec 06 , 2024 | 02:00 PM

గంగానీటిని మైక్రోస్కోప్‌తో చూడగా కలుషితాలు, సూక్ష్మక్రిములు ఏమీ లేకపోవడం పలువురిని ఆశ్చర్యానందాలకు గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Viral: అద్భుతం.. గంగానది నీటిని మైక్రోస్కోప్‌లో చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: హిందూ సంస్కృతిలో గంగానదికున్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దివి నుంచి భువికి దిగివచ్చిన గంగలో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం. గంగాదేవిని ఆరోగ్యప్రదాయనిగా కూడా భావిస్తారు. అయితే, ఇటీవల కాలంలో గంగానది కాలుష్యం పెరిగిపోతోందన్న వార్తలు కూడా అనేక మందిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలు, మురుగు, ప్లాస్టిక్ చెత్త వంటివన్నీ కలవడంతో గంగానది నీరు అనేక చోట్ల తాగేందుకు అనర్హంగా మారింది. ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం, గాంగానది నీరు తాగకూడదు (Viral).

Viral: బైక్‌పై భారీ ఒంటె తరలింపు.. నోరెళ్లబెడుతున్న జనాలు! వైరల్ వీడియో!


ఈ నేపథ్యంలో ఐఐటీ కాన్‌పూర్ ఇటీవల జరిపిన ఓ అధ్యయనం గంగానది నాణ్యతపై కొత్త ఆశలు చిగురించేలా చేసింది. గంగోత్రి మొదలు రిషీకేశ్ వరకూ వివిధ ప్రాంతాల్లో గంగానది నీటిని పరిశోధకులు పరీక్షించారు. తాగునీటి నాణ్యతకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సూచించిన 28 ప్రామాణిక అంశాల ఆధారంగా గంగానది నీటిని పరీక్షించగా పలు ఆశావాహ ఫలితాలు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లోని గంగానది నీటిలో కాలుష్యం లేనట్టు ఈ పరీక్షల్లో తేలింది.

ఈ క్రమంలో ఆశూఘాయ్ అనే వ్యక్తి షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట మరింత ఆసక్తిరేకెత్తిస్తోంది. గంగానది నీటిని మైక్రోస్కోప్‌లో పరీక్షించగా సూక్ష్మక్రిములు లేకపోవడం అనేక మందిలో ఆశ్చర్యానందాలకు రేకెత్తిస్తోంది.

Viral: ఏం ఐడియా బ్రో.. గుళ్లల్లో చెప్పులు చోరీ కాకుండా ఉండేందుకు భలే చిట్కా!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, తొలుత అతడు చుక్క నీటిని మైక్రోస్కోప్ కింద పెట్టి చూశాడు. అందులో వ్యర్థాలు గానీ సూక్ష్మక్రిములు గానీ కనిపించలేదు. ఆ తరువాత అతడు గంగానదిని ప్రొఫెషనల్‌కు ఇచ్చి పరీక్షించమని కోరాడు. 40ఎక్స్ మైక్రోస్కోప్ కింద గంగానీటిని చూడగా అందులో ఎటువంటి వ్యర్థాలు కనిపించలేదు. అంతేకాకుండా, ఆ నీటిని కల్చర్‌కు పంపించినా కూడా సూక్ష్మక్రిముల జాడ కానరాలేదు. దీంతో, ఆ నీటిలో కలుషితం లేదంటూ ల్యాబ్ రిపోర్టు వచ్చింది.

వీడియోలో ఇదంతా చూసిన జనాలు కూడా ఆశ్చర్యపోయారు. కనీసం కొన్ని ప్రాంతాల్లో అయినా గంగాజలంలో కాలుష్యం తక్కువగా ఉన్నట్టు తేలడం మనసుకు ఆనందాన్ని ఇచ్చిందని ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు. పరిస్థితిని మరింతగా మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral: సిబ్బంది కళ్లుకప్పి విమానమెక్కిన మహిళ.. బాత్రూమ్‌లల్లో కూర్చుని జర్నీ!

Elon Musk: భారత్‌లో ఒకే రోజులో 640 మిలియన్ ఓట్లు లెక్కించారు! మస్క్ ప్రశంసలు

Read Latest and Viral News

Updated Date - Dec 06 , 2024 | 02:05 PM