Team India: టీమిండియాలో బుమ్రాను మించిన బౌలర్.. అతడి ముందు సిరాజ్ జుజుబి.. వెస్టిండీస్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 10 , 2024 | 01:14 PM
టీమిండియాలో బుమ్రాను మించిన బౌలర్ ఉన్నాడంటూ వెస్టిండీస్ లెజెండ్ హాట్ కామెంట్స్ చేశాడు. బుమ్రాను మించి బౌలింగ్ చేయగలిగే సామర్థ్యంతో పాటు కొన్ని అదనపు నైపుణ్యాలు కూడా అతడి సొంతం అని తెలిపాడు. తన స్టేట్మెంట్ ను ప్రూవ్ చేసుకునేందుకు పలు ఉదాహరణలు సైతం ఇచ్చాడు. ఇంతకీ అతడు చెప్తున్న వ్యక్తి ఎవరో కాదు.. జట్టులో లేకపోయినా ప్రస్తుతం అందిరిచూపు అతడివైపే...
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ లెజెండ్ ఆండీ రాబర్ట్స్ వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీపై ప్రశంసలు గుప్పించాడు. టీమిండియాలో బుమ్రా బౌలింగ్ గురించే అంతా మాట్లాడతారు. కానీ అతడిని మించిన లెజెండ్ షమీనే అంటూ కొనియాడాడు. 1970, 1980ల్లో మైఖేల్ హోల్డింగ్, జోయెల్ గార్నర్, కోలిన్ క్రాఫ్ట్ లను కలిగి ఉన్న వెస్టిండీస్ జట్టులో రాబర్ట్స్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. షమీ బంతిని కంట్రోల్ చేసే విధానం.. రెండు వైపులా స్వింగ్ చేయడం, సీమింగ్ లోనూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించడం ఆండీని తెగ ఆకట్టుకున్నాయట.
షమీతో సిరాజ్‌కు పోలికా..
‘‘షమీ కొంతకాలంగా భారతదేశం అత్యుత్తమ బౌలర్ గా కొనసాగుతున్నాడు. వికెట్లు తీసే విషయంలో బుమ్రాతో అతడు పోటీ పడలేకపోవచ్చు. కానీ అతడో కంప్లీట్ ప్యాకేజ్ స్టార్. అందరికన్నా ఎక్కువ నిలకడ ఉన్న ఆటగాడు. అతడు బంతిని స్వింగ్ చేయగలడు, సీమ్ కూడా చేయగలడు. బంతిని షమీ అంత బ్యాలెన్స్ తో మరెవ్వరూ ఆడలేరు. షమీ కచ్చితంగా ఆసిస్ తో జరిగే మ్యాచుల్లో ఆడాలి. ఇక మొహమ్మద్ సిరాజ్ విషయానికొస్తే షమీని టచ్ కూడా చేయలేడు. అతడి దరిదాపుల్లో కూడా సిరాజ్ నిలవడు’’ అంటూ ఈ బౌలింగ్ దిగ్గజం ప్రశంసించాడు. ఆడిలైడ్ లో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ముందుగా బ్యాటింగ్ దిగాలన్న షమీ ఆలోచనను కూడా రాబర్ట్స్ మాట్లాడాడు. బ్రిస్బేన్ వేదికగా ఆసీస్‌తో జరిగే మూడో టెస్టులో షమిని ఆడించాలని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. బుమ్రా ఇప్పటివరకు 42 టెస్టుల్లో 185 వికెట్లు పడగొట్టగా.. షమి 64 టెస్టుల్లో 229 వికెట్లు సాధించాడు.
బ్యాటింగ్‌కు ఎందుకంత తొందర..
‘‘ఈ కుర్రాళ్లు ముందే ఎందుకు బ్యాటింగ్ కు దిగుతారో అర్థం కాదు. పెర్త్ లో బౌలింగ్ చేసిన భారత జట్టు రెండు ఇన్నింగ్స్ లోనూ ఆస్ట్రేలియాను సునాయాసంగా ఔట్ చేసింది. మీరు భారత పిచ్ లపై ఆడటం లేదన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలి. ఇక్కడి పిచ్ లపై బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక్క స్పిన్నర్ తోనే ఆడుతున్నారు. ఈ కారణంగా మీరు అదనపు పరుగులు చేయలేరు’’ అని రాబర్ట్స్ తెలిపాడు. గాయం కారణంగా ఆటకు దూరమైన షమీ.. ఇటీవల రంజీ ట్రోఫీ, ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్స్ లో అద్భుతమైన ఫామ్ ను కనబరిచాడు. అయితే, ఈ ప్రదర్శనలు చేసినప్పటికీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన మ్యాచులకు తిరిగి రావడానికి షమీకి నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆడిలైడ్ లో భారత్ ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ వర్మ జట్టుకు షఫమీ విలువను గుర్తించాడు. షమీ రాక కోసం టీమిండియా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయంటూ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఐదు మ్యాచ్ లో సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మిగిలిన మ్యాచ్ ల్లో షమీ పాల్గొనే అవకాశంపై అనుమానాలున్అనాయి. ఒకవేళ షమీ జట్టులోకి తిరిగొస్తే భారత్ కు మరిన్ని మెరుగైన అవకాశాలను తీసుకురాగలడు.