IPL 2025: రబాడ దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ.. ఒక్క వారంలో అంతా రివర్స్
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:04 PM
LSG vs PBKS: ఐపీఎల్ రెండో వారంలో దాదాపుగా మ్యాచులు ఒకేలా జరుగుతున్నాయి. నిన్న లక్నో వర్సెస్ పంజాబ్ మ్యాచ్ కూడా ఇలాగే ముగిసింది. దీంతో పేసర్ రబాడ దెబ్బకు బీసీసీఐ దిగొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబాడ ఇటీవల ఐపీఎల్‌పై సీరియస్ కామెంట్స్ చేశాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో బ్యాటర్లదే రాజ్యం నడుస్తోందని అన్నాడు. ఫ్లాట్ పిచ్‌ల వల్ల 250 ప్లస్ స్కోర్లు కూడా నీళ్లు తాగినంత ఈజీగా బాదేస్తున్నారని చెప్పాడు. బంతికి, బ్యాట్‌కు మధ్య సమతూకం లేకపోతే ఎలా అని ప్రశ్నించాడు. ఇది ఇలాగే కొనసాగితే క్రికెట్ అని కాకుండా.. బ్యాటింగ్ అంటూ ఆట పేరు మారిస్తే బెటర్ అని విమర్శించాడు. అతడి వ్యాఖ్యలు వైరల్ అవడంతో భారత క్రికెట్ బోర్డు జాగ్రత్త చర్యలకు దిగిందని తెలుస్తోంది. అందుకు ఈ వారంలో జరిగిన ఐపీఎల్ మ్యాచులే ఎగ్జాంపుల్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.
ఒక్క వారంలో అంతా రివర్స్..
తాజా ఐపీఎల్ ఎడిషన్ ఫస్ట్ వీక్‌లో దాదాపుగా అన్నీ బిగ్ స్కోర్ మ్యాచెస్ జరిగాయి. సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జియాంట్స్-ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచుల్లో 200కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచుల్లో ఆడిన ఇరు జట్లు డబుల్ హండ్రెడ్ మార్క్‌ను దాటేశాయి. దీంతో రబాడ పైవ్యాఖ్యలు చేశాడు. ఇది క్రికెటేనా.. ఇలాగేనా మ్యాచులు నిర్వహించేది.. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌కు కూడా పిచ్ నుంచి సపోర్ట్ ఉండాలంటూ సూచనలు చేశాడు. ఇది బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. గత వారం రోజులుగా ఐపీఎల్‌లో యావరేజ్ స్కోరింగ్ మ్యాచులు జరుగుతున్నాయి. ఒక్క మ్యాచ్‌లో కూడా స్కోరు 200 దాటలేదు.
అన్నీ 200 లోపే..
రబాడ మార్చి 25న హైస్కోరింగ్ మ్యాచుల గురించి కామెంట్ చేశాడు. అప్పటి నుంచి నిన్నటి (ఏప్రిల్ 1వ తేదీ) దాకా అంటే దాదాపు 7 రోజుల్లో ఒక్కసారి కూడా 200 ప్లస్ స్కోరు నమోదవలేదు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఆర్సీబీ 196 పరుగులు, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ 196 పరుగులు చేశాయి. ఇవే హయ్యెస్ట్ స్కోర్స్. దీంతో రబాడ దెబ్బకు బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు దిగిందని.. యావరేజ్, లోస్కోరింగ్ మ్యాచులు ప్లాన్ చేస్తోందని నెటిజన్స్ అంటున్నారు. పిచ్‌లు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌కూ సహకరించేలా డిజైన్ చేయిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు రబాడను మెచ్చుకోక తప్పదని అంటున్నారు.
ఇవీ చదవండి:
హిట్టింగ్‌తో మోతెక్కించాడు.. ఎవరీ నేహాల్
అయ్యర్‌కు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి