Share News

KKR vs SRH Playing 11: కేకేఆర్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్.. ప్లేయింగ్ 11తోనే భయపెడుతున్నారు

ABN , Publish Date - Apr 03 , 2025 | 02:01 PM

Indian Premier League: సన్‌రైజర్స్-కోల్‌కతా జట్ల నడుమ మరికొన్ని గంటల్లో కీలక మ్యాచ్ జరగనుంది. క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్‌లో రెండు టీమ్స్ ఫ్యూచర్ ఎలా ఉండనుందనేది ఈ పోరుతో దాదాపుగా తేలిపోయే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ఫైట్‌లో రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందనేది ఇప్పుడు చూద్దాం..

KKR vs SRH Playing 11: కేకేఆర్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్.. ప్లేయింగ్ 11తోనే భయపెడుతున్నారు
KKR vs SRH Playing 11

కేకేఆర్-ఎస్‌ఆర్‌హెచ్.. ఈ రెండు జట్లూ ఇప్పుడు గెలిచి తీరాల్సిన స్థితిలో ఉన్నాయి. ఐపీఎల్ నయా సీజన్ ఇంకా రెండో వారంలోనే ఉంది. కనీసం సగం మ్యాచులు కూడా పూర్తి కాలేదు. కానీ ఈ రెండు జట్ల ఫ్యూచర్ ఏంటనేది ఇవాళ్టి మ్యాచ్‌తో దాదాపుగా క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. ఎందుకంటే అటు కోల్‌కతా, ఇటు సన్‌రైజర్స్ రెండూ పరాజయాలతో డీలాపడ్డాయి. కాబట్టి వీటి మధ్య ఇవాళ జరిగే ఫైట్‌లో గెలిచిన టీమ్.. మరింత కాన్ఫిడెన్స్‌తో తదుపరి మ్యాచుల్లో ఆడుతుంది. అదే ఓడిన టీమ్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఈ నేపథ్యంలో డూ ఆర్ డైగా మారిన పోరులో ఎవరి ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..


తగ్గేదేలే

సన్‌రైజర్స్-కోల్‌కతా.. రెండు జట్లూ ఓటములతో డీలాపడినా ప్లేయింగ్ 11 విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాయి. ఇరు టీమ్స్‌లో ఉన్న భీకర ఆటగాళ్లను కొనసాగించడం ఖాయమని తెలుస్తోంది. వాళ్లు గనుక క్లిక్ అయితే విజయం ఖాయమనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నట్లు సమాచారం. ఆ లెక్కన ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ స్టార్ట్ చేస్తారు. ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ వరుసగా నంబర్ 3, 4, 5లో బ్యాటింగ్‌కు దిగుతారు. అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్ ఫినిషర్ల రోల్ పోషిస్తారు.


బెర్త్ ఫిక్స్

కమిన్స్, హర్షల్, షమి పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోవడం ఖాయం. గత మ్యాచ్‌లో బంతిని తిప్పేసిన జీషన్ అన్సారీ ప్రధాన స్పిన్నర్‌గా ఆడటం పక్కా. ఇంపాక్ట్ ప్లేయర్‌గా పరిస్థితుల్ని బట్టి ముల్డర్, జంపాలో ఒకర్ని తీసుకోవచ్చు. అటు కేకేఆర్ టీమ్‌లోనూ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే దాదాపుగా కంటిన్యూ చేసే చాన్స్ ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు (అంచనా): క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానె (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

ఇంపాక్ట్ ప్లేయర్: వైభవ్ అరోరా.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహ్మద్ షమి, జీషన్ అన్సారీ.

ఇంపాక్ట్ ప్లేయర్: వియాన్ ముల్డర్/ఆడం జంపా.


ఇవీ చదవండి:

సన్‌రైజర్స్ గెలుపు దాహం తీరేనా..

కొత్త గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్పేసిన ధవన్

స్టార్ యాక్టర్‌పై కోహ్లీ ఫ్యాన్స్ సీరియస్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 03 , 2025 | 02:05 PM