Share News

Nitish Kumar Reddy: ఒక్క ఇన్నింగ్స్‌తో 5 క్రేజీ రికార్డులు బ్రేక్.. ఇదీ తెలుగోడి దెబ్బ

ABN , Publish Date - Dec 28 , 2024 | 07:22 PM

Boxing Day Test: మెల్‌బోర్న్ టెస్ట్‌లో మ్యాజిక్ చేసి చూపించాడు నితీష్ కుమార్ రెడ్డి. స్టన్నింగ్ సెంచరీతో చేజారుతున్న మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో ఏకంగా 5 రికార్డులకు పాతర వేశాడు.

Nitish Kumar Reddy: ఒక్క ఇన్నింగ్స్‌తో 5 క్రేజీ రికార్డులు బ్రేక్.. ఇదీ తెలుగోడి దెబ్బ
Nitish Kumar Reddy

IND vs AUS: కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని పెద్దోళ్లు అంటుంటారు. ఆ మాటను నిజం చేసి చూపిస్తున్నాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. క్రికెట్‌లో అందరూ భయపడే కంగారూలకు వాళ్ల సొంతగడ్డ మీదే మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. 21 ఏళ్ల వయసులో భారత టెస్ట్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వైజాగ్ కుర్రాడు.. అరంగేట్ర సిరీస్‌లోనే సంచనాలు సృష్టిస్తున్నాడు. పెర్త్ టెస్ట్ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకొని అద్భుతాలు చేస్తున్నాడు. ఇవాళ మెల్‌బోర్న్ టెస్ట్‌లో అతడు కొట్టిన సెంచరీ న భూతో.. న భవిష్యత్ న భవిష్యత్ అనే చెప్పాలి. ఒకే ఇన్నింగ్స్‌తో ఏకంగా 5 క్రేజీ రికార్డులకు పాతర వేశాడు. ఆ రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం..


మూడో క్రికెటర్‌గా..

మెల్‌బోర్న్ టెస్ట్‌లో సెంచరీ కొట్టడం ద్వారా రేర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నితీష్ రెడ్డి. టెస్టుల్లో అత్యంత పిన్న వయసుల్లో శతకం బాదిన వారిలో 3వ స్థానంలో నిలిచాడు తెలుగోడు. 21 ఏళ్ల 216 రోజుల వయసులో నితీష్ ఈ మార్క్‌ను చేరుకున్నాడు. ఈ లిస్ట్‌లో మాజీ క్రికెటర్ అజయ్ రాత్రా టాప్ ప్లే‌స్‌లో ఉన్నాడు. ఆయన 20 ఏళ్ల 150 రోజుల వయసలో భారత్ తరఫున లాంగ్ ఫార్మాట్‌లో సెంచరీ కొట్టాడు. బంగ్లాదేశ్ క్రికెటర్ అబుల్ హసన్ (20 ఏళ్ల 108 రోజుల వయసు) ఈ జాబితాలో సెకండ్‌ ప్లేస్‌లో ఉండగా.. నితీష్ మూడో స్థానంలో నిలిచాడు. దీంతో మరో రికార్డును కూడా తెలుగోడు ఖాతాలో వేసుకున్నాడు.


సచిన్ సరసన తెలుగోడు

ఆసీస్ గడ్డపై సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడైన భారత క్రికెటర్ల జాబితాలోనూ మూడో స్థానంలో నిలిచాడు నితీష్. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, రిషబ్ పంత్ ఈ ఫీట్ నమోదు చేసి.. వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో 8వ నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ బాదిన క్రికెటర్‌గా నితీష్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ ఘనత ఇంకే బ్యాటర్ సాధించలేదు. ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ ఇప్పటిదాకా మొత్తం 8 సిక్సులు బాదాడు. తద్వారా ఆస్ట్రేలియాలో సింగిల్ సిరీస్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఆసీస్‌ గడ్డ మీద నంబర్ 8 లేదా అంతకంటే కింద బ్యాటింగ్‌కు దిగి అత్యధిక స్కోరు చేసిన ఇండియన్ బ్యాటర్‌గా నితీష్ రెడ్డి క్రేజీ రికార్డు సృష్టించాడు. గతంలో రవీంద్ర జడేజా (81) ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉండేవాడు. ఇప్పుడు అతడ్ని తెలుగోడు దాటేశాడు.


Also Read:

తండ్రినే కాదు.. మొత్తం స్టేడియాన్ని ఏడిపించాడు..

నితీష్ రెడ్డిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు.. గర్వపడేలా

కన్నీళ్లు ఆపుకోలేకపోయిన నితీష్ రెడ్డి తల్లి.. కొడుకు బ్యాటింగ్

అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి.. పుష్ప స్టైల్లో సంబరాలు

For More Sports And Telugu News

Updated Date - Dec 28 , 2024 | 07:28 PM