Share News

India vs South Africa: ఫైనల్ మ్యాచ్‌లో చుక్కలు చూపిస్తారు.. విజయం వారిదే!

ABN , Publish Date - Jun 28 , 2024 | 09:16 PM

జూన్ 2వ తేదీన ప్రారంభమైన టీ20 వరల్డ్‌కప్ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. శనివారం రాత్రి 8:00 గంటలకు జరగబోయే ఫైనల్ పోరుతో ఈ మెగా టోర్నీ ముగియనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, సౌతాఫ్రికా..

India vs South Africa: ఫైనల్ మ్యాచ్‌లో చుక్కలు చూపిస్తారు.. విజయం వారిదే!
India vs South Africa

జూన్ 2వ తేదీన ప్రారంభమైన టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) ఇప్పుడు తుది దశకు చేరుకుంది. శనివారం రాత్రి 8:00 గంటలకు జరగబోయే ఫైనల్ పోరుతో ఈ మెగా టోర్నీ ముగియనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, సౌతాఫ్రికా (India vs South Africa) జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. టోర్నీ ప్రారంభం నుంచి ఒక్క ఓటమి కూడా చవిచూడకుండా.. రెండు జట్లు ఫైనల్స్‌కు దూసుకొచ్చాయి. దీంతో.. ఎవరు టైటిల్ నెగ్గుతారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఇలాంటి తరుణంలో.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయభ్ అఖ్తర్ (Shoaib Akhtar) తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఫైనల్ పోరులో భారత్ గెలవాలని తాను కోరుకుంటున్నానని అన్నాడు. భారత జట్టు నుంచి సౌతాఫ్రికాకు ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్ అద్భుత విజయం సాధించిందని, ఈ విజయానికి వారు అర్హులని పేర్కొన్నాడు. నిజానికి.. గత రెండు వరల్డ్‌కప్స్‌లో (టీ20, వన్డే) భారత జట్టు ఛాంపియన్స్‌గా నిలుస్తుందని తాను భావించానని, కానీ చివర్లో బోల్తా కొట్టేసిందని గుర్తు చేసుకున్నాడు. ఈసారి కూడా భారత్ ఛాంపియన్స్‌గా నిలవాలని తాను గట్టిగా ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు.


ఈ ఫైన‌ల్ మ్యాచ్‌లో సఫారీలకు భారత్ నుంచి తీవ్రపోటీ ఎదురుకానుందని అఖ్తర్ హెచ్చరించాడు. ఈ ఫైనల్‌లో సఫారీ జట్టు గెలవాలంటే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలని, అప్పుడే వారికి గెలిచే ఛాన్స్ ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కానీ.. భారత జట్టు ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే మాత్రం చుక్కలు చూపించేస్తారని తెలిపాడు. భారత్‌లో వరల్డ్‌క్లాస్ స్పిన్నర్లు ఉన్నారని, వారిని ఎదుర్కొని సౌతాఫ్రికా బ్యాటర్లు ఎలా రాణిస్తారన్నది ఆసక్తిగా ఉందని పేర్కొన్నాడు. ఏదేమైనా.. ఆ జట్టుకి గెలుపు అవకాశాలు తక్కువగానే ఉన్నాయని, ఎందుకంటే వాళ్లు ఫైనల్‌లో తొలిసారి ఆడుతున్నారు కాబట్టి కచ్ఛితంగా ఒత్తిడి ఉంటుందని అన్నాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 28 , 2024 | 09:16 PM